Kangana Ranut: ఆర్ఆర్ఆర్ చూడాలనిఉంది అంటున్న క్వీన్…!

Kangana Ranut : బాలీవుడ్ క్వీన్ కంగనా ఎపుడు దేని గురించి స్పందిస్తుందో ఎవరికీ అర్థం కాదు. మొహమాటం లేకుండా మనసులో ఉన్నది అనేస్తుంది. ఎవరిని లెక్క చేయకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది ఈ బాలీవుడ్ క్వీన్. ఇపుడు ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడి మళ్ళీ వార్తల్లో నిలిచింది.

ఆర్ఆర్ఆర్ సినిమా ను చూడడానికి ఆగలేక పోతున్నానని త్వరగా చూడాలనుకుంటున్నాని సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ పెట్టింది. ఇక తన ఇష్టమైన రైటర్ డైరెక్టర్ సినిమా చూడటానికి ఆతృత్తగా ఉన్నానని అన్నారు. కంగనా రనూత్ ఇంతకుముందు విజయేంద్ర ప్రసాద్ తో కలిసి పని చేసారు. మణికర్ణిక 2019, జయలలిత2021 బయోపిక్ సినిమాలకు ఇద్దరు కలిసి పనిచేసారు.ఇక తన తదుపరి ప్రాజెక్ట్ సీత కూడా విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందించనున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచం వ్యాప్తంగా విడుదలయి అన్నిచోట్లా రచ్చ చేస్తోంది. ఇక చరణ్,ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అటు రేటింగ్స్ లో కూడా దూసుకుపోతోంది. మరో ఐదేళ్లైనా ఎవ్వరూ అందుకోలేని స్టేజ్‌ను సెట్ చేసింది. అయితే ఈ రికార్డును సెట్ చేసింది ఇండియా లో కాదు… అవుట్ ఆఫ్‌ ఇండియా అమెరికాలో..! ఎస్! ద మోస్ట్ ఆంటిసిపేటెడ్‌ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్.. బాహుబలి రికార్డును బద్దలు కొట్టేసింది. అమెరికాలో ఈ సినిమా 1000 మల్టీప్లెక్స్‌లలో రిలీజ్‌ అవ్వడమే వండర్ అనుకుంటే… జెస్ట్ అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే 2.5 మిలియన్ డాలర్లు వసూల్ చేసి మరో నెవర్ ఎక్స్‌పెక్టెడ్‌ వండర్‌ను క్రియేట్‌ చేసింది. అంతేకాదు అమెరికా గడ్డనే తన అడ్డాగా మార్చుకుని మరీ… యూఎస్‌లో నెంబర్ 1 ఫిల్మ్ గా లిస్టవుట్‌ అయింది.