బింబిసార 2: కళ్యాణ్ రామ్ కోపం ఇంకా తగ్గలేదా?

ఎంతోకాలంగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు. ఇక ఆ సినిమా సక్సెస్ కావడంతో సీక్వెల్ ను కూడా వీలైనంత త్వరగా తెరపైకి తీసుకురావాలని అనుకున్నాడు. ఎందుకంటే జి స్టూడియోస్ కళ్యాణ్ రామ్ కు మంచి ఆఫర్ కూడా ఇచ్చింది.

100 కోట్లకు సినిమాకూబ్సంబంధించి అన్ని రకాల రైట్స్ ఇవ్వాలి అని ఒక ఒక డీల్ గురించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కళ్యాణ్ రామ్ దర్శకుడితో మాట్లాడి సిల్వెల్ ను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ వశిష్ట మాత్రం మళ్లీ అదే తరహా కథను తెరపైకి తీసుకురావడానికి ఇష్టపడడం లేదు. అతనికి మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆఫర్ రావడంతో మరొక బిగ్ బడ్జెట్ సినిమాను తెరపైకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు.

అయితే వశిష్ట లీగల్ గా అయితే మెగాస్టార్ సినిమా చేయడానికి వీలుపడదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ లో అతను రెండవ సినిమా కూడా చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ సమస్య సాల్వ్ అయ్యేవరకు కూడా మరొక బ్యానర్లో సినిమా చేయడానికి వీలులేదు. ఇక ఈ క్రమంలో ఏడాది పూర్తయిన సందర్భంగా బింబిసార సినిమాకు సంబంధించి ఒక స్పెషల్ పోస్టును దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఏ విధంగా దానిపై స్పందించలేదు. కళ్యాణ్ రామ్ పేరు కూడా దర్శకుడు వశిష్ట పోస్టులో పేర్కొన్నాడు. ఇక కళ్యాణ్ రామ్ మాత్రం డెవిల్ సినిమాకు సంబంధించిన పోస్టర్ను షేర్ చేసుకున్నాడు కానీ బింబిసార గురించి చిన్న కామెంట్ కూడా చేయకపోవడం వైరల్ అవుతుంది. దీన్నిబట్టి వీరిద్దరి మధ్యలో ఇంకా గొడవ ఏమాత్రం అనగా లేదు అని అర్థమవుతుంది. ఇక బింబిసార 2 రొమాంటిక్ దర్శకుడు అనిల్ పుడూరి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్. అంతను బింబిసార సినిమాకు VFX సూపర్ వైజర్ గా వర్క్ చేశాడు.