గత ఏడాది ఒక్కసారిగా టాలీవుడ్ లో కూడా బాలీవుడ్ మాదిరి ఓ రెండు నెలలు గట్టి షాక్ తగిలింది. జూన్ మధ్య నుంచి జూలై ల మధ్యలో వచ్చిన ఏ సినిమా కూడా ఆశించ స్థాయిలో రాణించలేదు. దీనితో ఒక్కసారిగా షాకింగ్ సంక్షోభం నెలకొనగా నిర్మాతలు తలలు పట్టుకున్నారు. అదే సమయంలో ఛాలెంజింగ్ గా ఒకేరోజు వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఆ చిత్రాల్లో ఒకటే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “బింబిసార” చిత్రం. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచి అదరగొట్టింది. ఇక టాలీవుడ్ లో ఊపందుకున్న సీక్వెల్స్ లో భాగంగా దీనికి కూడా సీక్వెల్ ఉందని కన్ఫర్మ్ చేయడంతో నందమూరి అభిమానులు సహా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ రెండో సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉండడం విశేషం.
కాగా ఈ సినిమా ఎప్పుడు నుంచి మొదలు అవుతుంది అనేది ఫైనల్ గా ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ రానా అమిగోస్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ బింబిసార పార్ట్ 2 ని తాము ఈ ఏడాది చివరలో మొదలు పెట్టబోతున్నామని తెలియజేసాడు.
దీనితో ఈ అవైటెడ్ సీక్వెల్ పై ఓ గుడ్ న్యూస్ ఇప్పుడు బయటకి వచ్చింది అని అనుకోవచ్చు. మరి ఈ సినిమాలో కూడా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా కళ్యాణ్ రామ్ నే ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మాణం వహించనున్నాడు.