‘బింబిసార’: కళ్యాణ్ రామ్ చేతులెత్తేసినట్లేనా.?

కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘బింబిసార’ సినిమా. తక్కువ బడ్జెట్ సినిమా అయినా, భారీ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టింది ఈ సినిమా. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో కళ్యాణ్ రామ్ ఓ డెసిషన్ తీసుకున్నాడు.

అదే, ఈ సినిమాకి వరుస సీక్వెల్స్ రూపొందించాలనుకోవడం. ప్రాంఛైజీల రూపంలో ‘బింబిసార’ సినిమాలు వస్తూనే వుంటాయని చెప్పాడు. అయితే, ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయ్. ‘బింబిసార’తో వచ్చిన కిక్కు, ‘అమిగోస్’తో చెడిపోయింది కళ్యాణ్ రామ్‌కి. నిజానికి ‘అమిగోస్’ కూడా అంతే.. సీక్వెల్స్ వుంటాయని హింట్ ఇచ్చాడు.

కానీ, ఆ పరిస్థితి లేకుండా చేసింది ‘అమిగోస్’ రిజల్ట్. ఇక, ‘బింబిసార’ విషయానికొస్తే.. ఆ ఛాయలు ఎక్కడా కనిపించడం లేదు. చూస్తుంటే, ‘బింబిసార’ను కళ్యాణ్ రామ్ లైట్ తీసుకున్నాడనీ ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.

‘బింబిసార 2’ కోసం ఏకంగా ఎన్టీయార్‌నే లైన్‌లో దించనున్నాడన్న టాక్ వినిపించింది. ఎన్టీయార్ కాదు కదా.. కళ్యాణ్ రామ్ హీరోగా అయినా ఇప్పట్లో ఈ సీక్వెల్స్ తెరకెక్కే పరిస్థితి లేదంటున్నారు.