నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తనతో జత కట్టిన హీరోయిన్లకు డబుల్ చాన్స్ ఇవ్వబోతున్నాడట. ఆ ముద్దుగుమ్మలు ఎవరో కాదు, సంయుక్తా మీనన్, ఆషికా రంగనాధ్. రీసెంట్‌గా కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది.
అలాగే, ‘అమిగోస్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ ఆషికా రంగనాధ్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు కానీ, ఆషికా రంగనాధ్‌కి అప్పుడే మాటిచ్చాడట కళ్యాణ్ రామ్. మళ్లీ కలిసి పని చేద్దాం అని.
దాంతో, తన కొత్త సినిమాలో ఈ ముద్దుగుమ్మలిద్దరితోనూ ఆన్ స్ర్కీన్ రొమాన్స్‌కి సిద్దమవుతున్నాడట కళ్యాణ్ రామ్. ఓ కొత్త దర్శకుడితో తెరకెక్కుతోన్న సినిమాలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్నీ హీరోయిన్లుగా కళ్యాణ్ రామ్ ఫిక్స్ చేశాడనీ సమాచారం. ఓన్ ప్రొడక్షన్ ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ సినిమా వుండనుందనీ తెలుస్తోంది. వీలైనంత తక్కువ టైమ్‌లోనే ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేసే యోచనలో కళ్యాణ్ రామ్ వున్నట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం.