కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్.!

ఇపుడు టాలీవుడ్ లో మారిపోయిన ట్రెండ్ తో అయితే తమ మార్కెట్ ని పోగొట్టుకున్న హీరోలు అంతా ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు ఎంపిక చేస్తూ మళ్ళీ ట్రాక్ లోకి వస్తున్నారు. మరి అలాంటి హీరోస్ లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ఒకడు. మరి కళ్యాణ్ రామ్ అయితే హీరోగా ఈ ఏడాది నటించిన చిత్రం అమిగోస్ తో పలకరించగా ఇది బాక్సాఫీస్ దగ్గర అంత సక్సెస్ కాలేదు కానీ ఓటిటిలో వచ్చాక చాలా మందికి నచ్చింది.

అయితే దీనికి ముందు తాను నటించిన చిత్రం “బింబిసార” తన కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ చిత్రం గా తెరకెక్కించగా దీని తర్వాత అయితే మరింత భారీ బడ్జెట్ చిత్రంగా ప్లాన్ చేసిన సినిమానే “డెవిల్”. యంగ్ దర్శకుడు నవీన్ మేడారం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అయితే ఓ ఇండో బ్రిటిష్ స్పై కః ఆధారంగా భారీ వ్యయంతో అయితే తెరకెక్కుతుంది.

అలాగే ఈ చిత్రం హై ప్రొడక్షన్ వాల్యూస్ తో సహా కొత్త చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్టుగా ఆ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ చూస్తేనే అర్ధం అయ్యింది. మరి ఇలా మంచి సక్సెస్ ఫార్ములాతో రాబోతున్న ఈ చిత్రాన్ని మేకర్స్ పలు మార్లు వాయిదా వేయగా ఇప్పుడు అయితే చిత్ర యూనిట్ ఫైనల్ గా మరో డేట్ ని ఇప్పుడు అనౌన్స్ చేశారు. కాగా ఈ చిత్రం డేట్ ని అయితే నవంబర్ 24కి ఫిక్స్ చేశారు.

మరి ఆ రోజున ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రంలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తుండగా RRR లో ఎడ్వర్డ్ గా కనిపించిన నటుడు కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. అలాగే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సెటప్ చేసిన ఈ చిత్రాన్ని మేకర్స్ అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.