ఓటిటి : కళ్యాణ్ రామ్ “అమిగోస్” ఇందులో వచ్చేసింది.!

amigos-e1676027532360

నందమూరి వారి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తాను కూడా చాలా కాలం తర్వాత తన సినిమాల స్టైల్ మార్చి మళ్ళీ హిట్ కొట్టేందుకు చాలా సమయాన్ని అయితే తీసుకున్నాడు. మరి ఈ చిత్రం “బింబిసార” కాగా ఈ సినిమా హిట్ తర్వాత చేసిన మరో ప్రయోగాత్మక చిత్రమే “అమిగోస్”.

మూడు రోల్స్ లో నటించిన ఈ చిత్రాన్ని కూడా కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి అయితే దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా “బింబిసార” క్రేజ్ తో మంచి బిజినెస్ ని జరుపుకుంది కానీ ఫైనల్ గా నష్టాల్లోనే ముగిసింది. కాగా ఈ సినిమా అయితే ఈ మధ్య కొన్ని సినిమాల్లా కాకుండా ఓటిటి లో వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయాన్నే అయితే తీసుకుంది.

మరి ఈ సినిమా ఓటిటి హక్కులు ఆల్రెడీ ప్రముఖ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉన్న సంగతి తెలిసిందే. ఇందులోనే ఈ సినిమా ఈరోజు ఏప్రిల్ 1 నుంచి అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసినట్టుగా కన్ఫర్మ్ అయింది. అయితే ప్రస్తుతానికి తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ కి ఉన్న ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో అయితే కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఇందులో బాలయ్య హిట్ సాంగ్ కూడా ఒకటి రీమిక్స్ చేయగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహించారు.