Kalyan ram : కళ్యాణ్ రామ్ బింబిసార కోసం రంగం లోకి కీరవాణి…!

Kalyan ram : నందమూరి నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ అంత రాణించలేదు. అయితే మంచి సినిమాలను చేస్తూ హీరో గా నిలదొక్కుకున్నాడు. ఇక కెరీర్ లో అతనోక్కడే, పటాస్,కళ్యాణ్ రామ్ కత్తి వంటి సినిమాలతో హిట్ కొట్టాడు అటు మాస్ సినిమాలు ఇటు కథా బలమున్న సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఎంత మంచివాడవురా సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్.

ఇక ప్రొడ్యూసర్ గా కూడా మంచి చిత్రాలను నిర్మించారు. ఇపుడు బింబిసార గా రాబోతున్నాడు.తనపై దండెత్తడానికి వచ్చిన శత్రుమూకలపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడిగా కళ్యాణ్ రామ్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జోడీగా ఇద్దరు హీరోయిన్స్ కేథరిన్‌, సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి రెండో భాగం కూడా ప్లానింగ్ లో ఉంది. మొదటి పార్ట్ విడుదలైన తరువాత దాని రిజల్ట్ ని బట్టి పార్ట్ 2 విషయంలో నిర్ణయం తీసుకుంటారట.

నిజానికి ఆయన ‘బింబిసార’ సినిమా షూటింగ్ పూర్తి చేసి చాలా కాలమైంది. కానీ ఇంకా రిలీజ్ డేట్ సెట్ కావడం లేదు. డిసెంబర్ లో విడుదల చేస్తారని అన్నారు కానీ అది జరగలేదు. ఇప్పుడు ఏప్రిల్ కూడా వచ్చేస్తోంది. మరి రిలీజ్ డేట్ ని ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్ గా సంతోష్ నారాయణ్ పేరు టీజర్ లో కనిపించింది.అయితే పాటలు చిరంతన్ భట్ అని మరో పేరుని యాడ్ చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క పాటను కూడా విడుదల చేయలేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో కీరవాణి పేరు కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది. హిస్టారికల్ సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి కీరవాణితో ఒక పాటను రీరికార్డింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సాంగ్ పూర్తయితే కానీ సినిమా రిలీజ్ కి నోచుకోదు.