కళ్యాణ్ రామ్ “డెవిల్”..దర్శకుడు – నిర్మాత షాకింగ్ గొడవలు

రానున్న రోజుల్లో టాలీవుడ్ నుంచి వచ్చే పలు భారీ చిత్రాల్లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “డెవిల్” కూడా ఒకటి. అయితే ఓ ఇండియా స్పై జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని చాలా గ్రాండ్ స్కేల్ లో అయితే తెరకెక్కించారు.

అలాగే ఇప్పటికే వచ్చిన టీజర్ కూడా మంచి హైప్ ని తీసుకొచ్చాయి. మరి ఇదిలా ఉండగా ఇదంతా బాగానే ఉంది కానీ లేటెస్ట్ గా మాత్రం ఓ ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమా “నేనింతే” లో రవితేజ ఎంతో కస్టపడి సినిమా దర్శకత్వం వహించి సినిమా చేస్తే చివరిలో డైరెక్టర్ పేరు ప్లేస్ లో నిర్మాత యాదు పేరు రావడం షాకింగ్ ట్విస్ట్ గా కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు డెవిల్ సినిమాకి కూడా జరిగింది. అయితే ఈ సినిమాని యువ దర్శకుడు నవీన్ మేడారం తెరకెక్కించాడు. కానీ నిన్న వచ్చిన సినిమా అప్డేట్ పోస్టర్ మతం లో మాత్రం సినిమా దర్శకుడు ప్లేస్ లో నిర్మాత అభిషేక్ నామ పేరు వేసుకున్నారు. ఇది షాకింగ్ ట్విస్ట్ గా మారింది. కాగా దీనిపై దర్శకుడు కూడా వినాశకాలే విపరీత బుద్ది అని పోస్ట్ కూడా చేసాడు.

అయితే ఈ సినిమా నుంచి ఈరోజు ఇచ్చిన అప్డేట్ లో కూడా సేమ్ దర్శకుడు నవీన్ మేడారం ప్లేస్ లో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామ పేరునే కనిపించింది. దీంతో రియల్ లైఫ్ లో నేనింతే సినిమా రిపీట్ అయ్యింది అని అంటున్నారు. మరి ఈ సినిమా విషయంలో ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.
https://x.com/AbhishekPicture/status/1702636411361575358?s=20