విడాకులకు సిద్ధమైన కాజల్ సోదరి నిషా అగర్వాల్… విడాకులకు కారణం ఇదేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కాజల్ అగర్వాల్. ఇక ఈమె ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈమె బాటలోనే ఈమె సోదరి నిషా అగర్వాల్ సైతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈమె సోలో, సుకుమారుడు వంటి పలు సినిమాలలో నటించారు.అయితే ఈమె సినిమా ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇక ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నారు.

ఇక నిషా అగర్వాల్ తన సోదరి కాజల అగర్వాల్ తో అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ వీరిద్దరూ ఎంతో సందడి చేస్తూ ఉంటారు. ఇకపోతే జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి నిషా అగర్వాల్ కి తన భర్తతో మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తుంది.ఇలా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం చేత ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా నిషా అగర్వాల్ విడాకుల గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై కాజల్ లేదా నిషా అగర్వాల్ ఏమాత్రం స్పందించలేదు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ విషయంపై నిషా అగర్వాల్ లేదా కాజల్ అగర్వాల్ స్పందించాల్సి ఉంది. ఇక కాజల్ అగర్వాల్ సైతం తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకొని ప్రస్తుతం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ కుమారుడికి కూడా జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.