కాజల్.. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ కామెంట్స్..?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ గురించి తెలియని వాళ్లంటూ ఉండరు. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక ఈ అందాల చందమామ 2020 వ సంవత్సరంలో గౌతమ్ కిచ్లూ ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కాజల్ వరుస సినిమాలలో నటించింది.

ఇక ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గర్భం దాల్చిన తర్వాత సినిమాలకు దూరమైన కాజల్ కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ సంపాదించడమే కాకుండా బిజినెస్ లో కూడా అడుగు పెట్టింది. ఈ క్రమంలో తన భర్త బిజినెస్ లో సహాయం చేయడమే కాకుండా తన చెల్లితో కలిసి పలు ఆన్లైన్ సంస్థలలో పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేస్తోంది. ఇక ఇటీవల ఈ అమ్మడు బిజినెస్ లో మరో మెట్టు ఎదిగింది. భర్త గౌతమ్ కిచ్లు తో కలిసి ప్రముఖ మోడల్ శిల్పా రెడ్డీ తో బిజినెస్ పార్టనర్ అయ్యింది.

ఈ మేరకు “కేర్ అండ్ కేరెస్ “(Kare and Karess) అనే పేరుతో కొత్త బిజినెస్ ప్రారంబించింది. ఈ కొత్త బిజినెస్ లో బేబీ కేర్ ప్రొడక్ట్స్ అమ్మబోతోందట.ఇటీవల తల్లిగా మారిన కాజల్ కి బేబీ కేర్‌కి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తుల గురించి మంచి అవగాహన ఉంటుంది. అందువల్ల బేబి కేర్ ప్రాడాక్ట్స్ అన్నిఒకే చోట దొరికేలా ఈ సంస్థను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇలా తల్లిగా మారిన తర్వాత కూడా సినిమాలలో వరుస అవకాశాలు అందుకోవటమే కాకుండా బిజినెస్ లో దోసుకుపోతోంది. అందువల్ల బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ నెటిజన్స్ ప్రశంశలు కురిపిస్తున్నారు.