కాజల్ చాలా గడుసు పిల్ల. చూడటానికి చాలా అమాయకంగా కనిపించిన కూడా చేసే కొంటె పనులు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పదేళ్ళుగా గౌతమ్ కిచ్లుతో ప్రేమయాణంలో ఉన్నప్పటికీ, కొంచెం కూడా లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు పడింది. పెళ్లికి కొద్ది రోజుల ముందే తను చేసుకోబోయే వ్యక్తి ఎవరనేది బయటకు వచ్చింది. పెళ్లి తర్వాత గౌతమ్‌తో ప్రెండ్షిప్, ప్రేమయాణం సంగతులు వివరించి అందరికి షాక్ ఇచ్చింది. ఇన్నోసెంట్‌గా కనిపించే కాజల్ మనం అనుకున్నంత అమాయకురాలు కాదంటూ పలువురు ఆరోపిస్తున్నారు.
అక్టోబర్ 30న కొద్ది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య కాజల్-గౌతమ్‌ల పెళ్లి వేడుక జరగగా , ఈ వేడుకకి సంబంధించిన చాలా ఫొటోలు బయటకు వచ్చాయి. ఇందులో కాజల్- గౌతమ్‌లని చూసిన నెటిజన్స్ చూడముచ్చటగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్‌కి వెళ్లిన నూతన దంపతులు మాల్దీవులలో ఆనంద క్షణాలు గడుపుతున్నారు.అక్కడి ఫొటోలని కాజల్ తన ఇన్‌స్టాగ్రాములో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌ని థ్రిల్ చేస్తుంది. అయితే ఈ అమ్మడు హనీమూన్ తర్వాత హైదరాబాద్, చెన్నైలలో రిసెప్షన్ ఏర్పాటు చేసుకుంటుందని సమాచారం.
గౌతమ్‌తో పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ తన పేరుని కాజల్ కిచ్లుగా మార్చుకుంది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలతో పాటు గతంలో దిగిన ఫొటోలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా కాజల్- గౌతమ్ ల లిప్ లాక్ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇది ఎప్పుడు దిగారనే దానిపై క్లారిటీ లేనప్పటికీ ఈ ఫొటో మాత్రం అంతర్జాలంలో సత్తా చాటుతుంది. పెళ్ళి తర్వాత కాజల్ వెరైటీ డ్రెస్‌లలో ఫొటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి వినోదం అందిస్తుంది. కాగా, కాజల్ సినిమాల విషయానికి వస్తే ఆచార్య, మోసగాళ్ళు, భారతీయుడు 2 సినిమాలతో బిజీగా ఉంది.