Kajal : 2020 అక్టోబర్ 30న వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ అగర్వాల్ వివాహం కుటుంబ సభ్యుల సమక్షం లో జరింగిన విషయం తెలిసిందే.కరోనా లాక్ డౌన్ వల్ల అత్యంత సన్నిహితులు బంధువుల నడుమ పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొన్నిరోజులకే కాజల్ తల్లికాబోతోంది అంటూ వార్తలోచ్చిన ఈ ఏడాది జనవరిలో తాను తల్లి కాబోతున్నట్లు కాజల్ సోషల్ మీడియాలో ప్రకటించింది.పలువురు సినిమా తారలు కాజల్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రెగ్నెంట్ అయిన తర్వాత మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ, కాజల్ అగర్వాల్ కొన్ని వీడియోలు చేశారు. ఇక ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో చేయాల్సిన వ్యాయామాలను కాజల్ అగర్వాల్ వీడియోలు షేర్ చేశారు. తనపై బాడీ షేమింగ్ విమర్శల పట్ల కూడా స్పందించారు.గర్భం దాల్చిన సమయంలో మహిళలు ధైర్యంగా ఉండాలని చెప్పారు.
ఇక ఈ రోజు ఆమెకు డెలివరీ అయ్యింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారని సమాచారం. అయితే బిడ్డ జన్మించిన విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. మంగళవారం ఉదయం కాజల్ చెల్లెలు, ఒకప్పటి కథానాయిక నిషా అగర్వాల్ అక్క డెలివరీ గురించి హింట్ ఇచ్చారు. “స్పెషల్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను” అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నిషా అగర్వాల్ పోస్ట్ చేశారు.కానీ కాజల్ కుటుంబ సభ్యులు గానీ, ఆమె భర్త గౌతమ్ కిచ్లూ గానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.