వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీకి కాస్త విరామం ప్రకటించి పూర్తిగా తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. 2020 అక్టోబర్ నెలలో తాను ప్రేమించిన వ్యక్తి గౌతమ్ ను పెళ్లాడిన ఈమె తాజాగా ఏడాది ఏప్రిల్ నెలలో ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఆ బాబుకి నీల్ కిచ్లు అని నామకరణం చేశారు.ఇక కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి పూర్తిగా సినిమాలకు దూరమై తన మాతృత్వపు క్షణాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
ఇకపోతే ఈమె నిత్యం తన కొడుకుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు తనపై ఎంత ప్రేమ ఉందో వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ ఆగస్టు 16 న పుట్టినరోజు జరుపుకోవడంతో తన భర్తకు అదిరిపోయే స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు.వివాహం తర్వాత గౌతమ్ కు ఇది రెండవ పుట్టినరోజు అలాగే తన కుమారుడు పుట్టిన తర్వాత తనకు మొదటి పుట్టినరోజు కావడంతో ఈ పుట్టినరోజు ఎంతో స్పెషల్ గా ఉండాలని కాజల్ భావించారు.
ఈ క్రమంలోనే తన కుమారుడిని వీరిద్దరూ చేతిలో పట్టుకొని కాజల్ అగర్వాల్ తన భర్తను దగ్గరకు తీసుకొని తనకు కిస్ పెడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప తండ్రి పైన నీకు హ్యాపీయస్ట్ బర్త్ డే.. మేము నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాం అంటూ తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా కాజల్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.