నందమూరి తారక రామారావు స్థాపించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి పేరు మార్చడం పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.తాజాగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీకి వైయస్సార్ పేరు పెట్టాలనే బిల్లును లోక్ సభకు సమర్పించడంతో ఈ సమావేశాలు బుధవారంతో మిగతా అయితే ఈ బిల్లును లోక్సభ ఆమోదించడంతో ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు పెట్టారు.
ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వం తీసుకున్న తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.నందమూరి తారక రామారావు 1986లో స్థాపించిన యూనివర్సిటీకి తన పేరు పెట్టారు చంద్రబాబు హయాంలో కూడా ఇదే పేరుతో కొనసాగిన యూనివర్సిటీ ప్రస్తుతం జగన్ హయాంలో ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెతుకుతున్నాయి.
ఈ విధంగా ఎన్టీఆర్ పేరును తొలగించడంతో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ వైయస్ఆర్ ఇద్దరూ విశేష ప్రేక్షకాదరణ కలిగిన గొప్ప నాయకులు. ఈ విధంగా ఒకరి పేరు తీసేసి మరొకరు పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. ఈ విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ కీర్తి తెలుగు జాతి చరిత్రలో ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, తెలుగు ప్రజల హృదయాల్లో వారికున్న జ్ఞాపకాలను చెరిపివేయదు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.