ఎన్టీఆర్ ‘దేవర’ ఎంతవరకు వచ్చింది!?

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర”. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రెట్టింపు ఉత్సాహంతో మేకర్స్ శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. చక్కటి ప్లానింగ్ తో ఉన్న ఈ టీమ్ తాజాగా ఓ భారీ షెడ్యూల్ ప్రారంభమయిందట. ఇక ఈ షెడ్యూల్ యాక్షన్ షెడ్యూల్ కాగా ఇందులో ఎన్టీఆర్ సహా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై అయితే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికీ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లను హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు. ఇప్పుడు అలాగే ఓ స్టన్నింగ్ సీక్వెన్స్ ని అయితే డిజైన్ చేశారట. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే!