అన్న “అమిగోస్” కి ఎన్టీఆర్ రివ్యూ..!

గత శుక్రవారం కాస్త అంచనాలు మధ్యనే వచ్చినా మైఖేల్ సినిమా డిజప్పాయింట్ చేసింది. ఇక ఈ శుక్రవారం అదృష్టం పరీక్షించుకోడానికి వస్తున్న కాస్త నోటెడ్ సినిమా “అమిగోస్”. ఇప్పుడు నందమూరి హీరోలు వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. కాగా రీసెంట్ గానే బాలయ్య కూడా తన కెరీర్ బిగ్ హిట్ అఖండ ని దాటి వీరసింహా రెడ్డి తో డీసెంట్ హిట్ ని అందుకున్నారు.

ఇక అమిగోస్ తో నందమూరి కళ్యాణ్ రామ్ అయితే ఇప్పుడు రాబోతున్నాడు. ఈ సినిమాలో తనకు వైవిధ్యంగా మొదటి సారి ట్రిపుల్ రోల్ లో నటించగా ఈ సినిమాని రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక మొన్ననే సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగగా దానికి యంగ్ టైగర్ కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ కూడా వచ్చాడు.

అయితే తాను అమిగోస్ సినిమా చూసి చిత్ర యూనిట్ కి తన రివ్యూ ఇచ్చినట్టుగా నిర్మాతలు ఈరోజు నిర్వహించిన మీట్ లో తెలిపారు. ఎన్టీఆర్ ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసారని అంతే కాకుండా తమని అభినందించారని కూడా తెలిపారు అని నిర్మాతలు తెలిపారు.

అంతే కాకుండా జడ్జిమెంట్ విషయంలో ఎన్టీఆర్ గారి నిర్ణయం కూడా పక్కాగా ఉంటుంది అని వారు మరింత కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశారు. దీనితో ఎన్టీఆర్ రివ్యూ మాత్రం మేకర్స్ కి మంచి బూస్ట్ గా నిలిచింది అని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించాడు అలాగే ఆషిక రంగనాథన్ హీరోయిన్ గా నటించింది.