జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ లైనప్ విషయంలో క్యూరియస్‌గా ఉంటారు. ప్రస్తుతం తారక్ ఒకేసారి రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2 చేస్తున్న తారక్, అదే సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్టులు కూడా భారీ అంచనాల నడుమే కొనసాగుతున్నాయి.
అయితే డ్రాగన్ తర్వాత తారక్ ఏ సినిమా చేస్తారు అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో ఫ్యాన్స్‌లో ఊహాగానాలు పెరిగాయి. కొంతమంది తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా వచ్చే అవకాశం ఉందన్నారు. మరికొంతమంది దేవర-2 కాస్త ఆలస్యం అయ్యిందని భావించారు. అయితే తాజాగా తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు. తారక్ ప్రస్తుతం డ్రాగన్ పూర్తి చేస్తారనీ, ఆ తర్వాత వెంటనే దేవర-2 సెట్స్‌పైకి వెళ్తారని స్పష్టం చేశారు.
దేవర-2 కచ్చితంగా జరుగుతుందని, ఈ సినిమా కూడా ఫస్ట్ పార్ట్ లాగే పాన్ ఇండియా స్కేల్‌లో ఉంటుందని వివరణ ఇచ్చారు. కోరటాల శివ ప్రస్తుతం ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ తీసుకోకుండా పూర్తి ఫోకస్ దేవర-2 మీదే పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దేవర-2 తర్వాత తారక్, నెల్సన్ కాంబినేషన్‌లో ఓ డిఫరెంట్ స్టైల్ పాన్ ఇండియా మూవీ మొదలయ్యే ఛాన్సులున్నాయి. జైలర్-2 పూర్తి చేసుకున్న వెంటనే నెల్సన్ ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించనున్నట్లు సమాచారం.