Bigg boss 4: లేటెస్ట్ అప్ డేట్.. ఈ వారం ఎలిమినేట్ అయింది ఎవరో తెలిసిపోయింది

jordar sujatha eliminated from bigg boss house

బిగ్ బాస్ 4 మజా మామూలుగా లేదు. ముందు ఎపిసోడ్లు ఓ లెక్క. బిగ్ బాస్ 4 ఒక లెక్క. ఇప్పటికే ఈ సీజన్ ఫుల్లు జోష్ లో నడుస్తోంది. ప్రతి వీకెండ్ కు నాగార్జున వచ్చి హౌస్ మెట్స్ అందరినీ బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. మొదట్లో కాస్త చప్పగా అనిపించినా.. షో రాను రాను ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

jordar sujatha eliminated from bigg boss house
jordar sujatha eliminated from bigg boss house

ఇప్పటికే ఆరోగ్యం బాగా లేక గంగవ్వ ఇంటి నుంచి వెళ్లిపోగా.. ఈ వారం నామినేషన్లలో ఉన్న వాళ్లలో జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయింది. సుజాత ఎలిమినేట్ అయిందని.. రేపు స్టేజీ మీదికి వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

నిజానికి.. ప్రస్తుతం నామినేషన్లలో ఉన్నవాళ్లలో వీక్ కంటెస్టెంట్ అంటే సుజాత అనే చెప్పుకోవాలి. ప్రతి చిన్న విషయానికి అలగడం, అయిన దానికి కాని దానికి నవ్వడం, నాగార్జునను బిట్టు అంటూ పిలవడం.. ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే.. సుజాతను షో నుంచి ఎలిమినేట్ చేశారు అనే టాక్ వినిపిస్తోంది.

jordar sujatha eliminated from bigg boss house
jordar sujatha eliminated from bigg boss house

అయితే.. హౌస్ లో సుజాత క్లోజ్ గా ఉండేది అంటే ఒక్క నోయల్ తోనే. అవును.. తను ప్రతి విషయం నోయల్ తోనే పంచుకుంటుంది. ఇప్పుడు ఆమె వెళ్లిపోతే నోయల్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.