Janvi kapoor : రౌడీ బాయ్ తో జతకట్టనున్న బాలీవుడ్ భామ… పాకిస్థానీ అమ్మాయి గా కనిపించబోతున్న ఆ హీరోయిన్ ఎవరో..?

Jhanvi Kapoor : ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో కీలక పాత్ర పోషించిన ఈ హీరో ఆ తరువాత పెళ్లిచూపులు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లో నీలాడొక్కుకుకుంటున్న హీరోలు చాలా తక్కువ మంది వుంటారు. వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.ప్రస్తుతానికి అయితే.. విజయ్ – పూరి ‘లైగర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. విజయ్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. సినిమా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ధీమాగా ఉన్నాడు. ఈ ‘లైగర్’ 2022 ఆగస్టులో విడుదల కానుంది.

లైగర్ సినిమా తర్వాత పూరి దర్శకత్వం లోనే జనగణమన తీస్తున్న సంగతి తెకిసిందే.కాశ్మీర్ నేపథ్యంగా ఈ సినిమాని తీస్తున్నాడు దర్శకుడు.ఇక ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండకినిపిస్తాడట.కథ విషయానికి వస్తే.. కాశ్మీర్ లో ప్రేమలో పడి, అక్కడే పెళ్లి చేసుకుంటాడట హీరో. అయితే.. ఆ యువతి పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఈ హీరోయిన్ పాత్రలో జాన్వీ కపూర్ నటించనుంది.

ఐతే జాన్వి కపూర్ ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన లైగర్ లో చేయాల్సింది, కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇపుడు వీరి జోడిని తెర మీద మనం చూడవచ్చు.పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ కలయికలో వస్తోన్న ఈ చిత్రంలో విజయ్ లుక్ చాలా వైల్డ్ గా ఉంటుందట. మధ్యలో మిలిటరీ కటింగ్ తోనే విజయ్ దేవరకొండ కనిపించినా సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడట.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల ఐన పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్థిందో చూడాలి.