Jhanvi Kapoor : భావల్ సినిమాలో వరుణ్ తో జతకట్టనున్న జాన్వీ….!

Jhanvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి చిన్న సినిమాతో ఎలాంటి హడావిడి లేకుండా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు చిన్న హీరోలతోనే సినిమా లు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ నుండి కూడా మంచి ఆఫర్స్ వస్తున్న అచీతూచి అడుగేస్తోంది జాన్వీ.

ఈ క్రమంలో ఆమె ఫస్ట్ టైమ్‌ ఓ పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ టైమ్‌ స్టార్‌ హీరోతో జోడీ కట్టే ఛాన్స్‌ వరించింది. స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్‌తో రొమాన్స్‌ చేసేందుకు ఎంపికైంది జాన్వీ కపూర్‌. జాతీయ అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ నితీష్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న `బవాల్‌` సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీన్ని సాజిద్‌ నడియడ్‌వాలా నిర్మిస్తుండటం విశేషం. ఇందులో హీరోగా వరుణ్‌ ధావన్ నటిస్తుండగా, ఆయనకు జంటగా జాన్వీనీ తీసుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించేసారు.

ఈ సినిమాని లవ్‌, ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నారట. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది యూనిట్‌. జాన్వీ కపూర్‌ ప్రస్తుతం `దోస్తానా 2`, `గుడ్‌ లక్‌ జెర్రీ`, `మిలి` సినిమాల్లో నటిస్తుంది. ఇవన్ని చిన్న బడ్జెట్‌ చిత్రాలే. మరోవైపు `కూలీ నెం.1` చిత్రంతో విజయాన్ని అందుకున్న వరుణ్‌ ధావన్‌ ఇప్పుడు `జగ్‌ జుగ్‌ జీయో`, `భేడియా` చిత్రాల్లో నటిస్తున్నారు.

మరోవైపు జాన్వీ తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. స్కిన్‌ షోలో తగ్గేదెలే అంటూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. మరోవైపు ఈ అందాల భామ తెలుగులోకి ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటోంది. విజయ్‌ దేవరకొండతో పూరీ జగన్నాథ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అలాగే అఖిల్‌తోనూ ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నట్టు టాక్‌.