Jersey Hindi remake : యూ ట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న జెర్సీ హిందీ రీమేక్ పాట..!

Jersey Hindi remake : తెలుగు సినిమాలు బాలీవుడ్ లో బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్ లో రీమేక్ అవడం కొత్త విషయం ఏం కాదు. అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలు సౌత్ లో కంటే సౌత్ సినిమాలు బాలీవుడ్ లో ఎక్కువ రీమేక్ అవుతున్నాయి.ఇక చాలా వరకు డబ్బింగ్ సినిమాల హవా నడుస్తోంది.

నాని నటించినా జెర్సీ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమాను షాహిద్ కపూర్ హిందీ లో రీమేక్ చేస్తున్నారు.క్రికెటర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా నాని కి మంచి పేరు తెచ్చిపెట్టింది.ఇక షాహిద్ కపూర్ ఇటీవలే అర్జున్ రెడ్డి రీమేక్ తో మంచి హిట్ కొట్టాడు. దాంతో మరొకసారి రీమేక్ నే నమ్ముకున్నాడు.

ఇక ఈ సినిమాను తెలుగు లో డైరెక్ట్ చేసిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు‌ సమర్పణలో దిల్‌రాజు, సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా నుండి విడుదలైన `మైయ్యా మైను` అంటూ సాగే పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇది ఏకంగా వంద మిలియన్స్ వ్యూస్ ని దాటేయడం విశేషం.

బాలీవుడ్‌ సంగీత ద్వయం సచేత్‌, పరంపర ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. `కబీర్‌ సింగ్‌` తర్వాత షాహిద్‌ కపూర్‌కి ఈ సంగీత ద్వయం పనిచేసిన చిత్రమిది. ఈ చిత్రంలోని అన్ని పాటలకు మంచి స్పందన లభిస్తుంది. మంచి మెలోడీ సంగీతానికి తగ్గట్టుగా షాహిద్, మృనాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది.తెలుగు రీమేక్‌తో వస్తోన్న `జెర్సీ `పై కూడా భారీ అంచనాలున్నాయి. మరి ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందో చూడాలి.