జాతి రత్నాలు మూవీ మరో అరుదైన రికార్డు.. ఈ మధ్యకాలంలో ఏ బాలీవుడ్‌కు సాధ్యం కాలేదు. వివరాల్లోకి వెళితే… కొన్ని సినిమాలకు అలా కలిసొస్తుంటాయి. కరోనా లాక్‌డౌన్ తర్వాత థియేటర్స్ తెరుచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్స్ నడుపుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రేక్షకులు కరోనాకు భయపడకుండా ఎంచక్కా థియేటర్స్‌కు వెళ్లి సినిమాలు చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వరస విజయాలు వస్తున్నాయి.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న ప్రేక్షకులు ఎలాంటి భయాలు లేకుండా థియేటర్స్‌కు వస్తున్నారు. ఈ యేడాది జనవరిలో ‘క్రాక్’మూవీతో మొదలైన కలెక్షన్ల ప్రభంజనం.. ఫిబ్రవరిలో ‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగిసింది. ఆ తర్వాత మళ్లీ ‘జాతి రత్నాలు’ సినిమాతో థియేటర్స్ కళ కళ లాడుతున్నాయి. అయితే. క్రాక్, ఉప్పెన సినిమాలు సాధించలేని రికార్డును ‘జాతి రత్నాలు’ సినిమా సాధించింది.
ఈ సినిమా తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. కరోనా తర్వాత విడుదలైన ‘మాస్టర్’, క్రాక్’, ఉప్పెన’ సినిమాలేవి యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయలేకపోయాయి. కానీ అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ‘జాతి రత్నాలు’ సినిమా మాత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్ వసూళ్లను సాధించింది. బాలీవుడ్‌లో రిలీజ్ సినిమాలేని ఈ మధ్యకాలంలో ఈ రేంజ్ వసూళ్లను సాధించలేవు. ఏమైనా చిన్న సినిమాగా రూ. 5 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లను సాధించడం నిజంగా గ్రేట్.
A million thanks to our USA #JathiRatnalu ❤️@NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul @anudeepfilm @vennelakishore @ItsActorNaresh @murlisharma72 @radhanmusic #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema @LahariMusic @FlyHighCinemas pic.twitter.com/q3UlHrsZ4n
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 26, 2021