ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్..100 కోట్లు కొల్లగొట్టిన ఉప్పెన!

లాక్‌డౌన్ త‌ర్వాత సినిమా రంగం ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌ని అంద‌రు ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో ఉప్పెన చిత్రం అందించిన కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. సున్నిత‌మైన ప్రేమ క‌థాంశంగా రూపొందిన ఉప్పెన చిత్రం తొలి రోజు నుండే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళ రాబ‌డుతూ అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. నాలుగైదు రోజుల‌లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను క్రాస్ చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

 

Uppena 100 Crore Gross

డెబ్యూ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు, డెబ్యూ హీరో వైష్ణ‌వ్ తేజ్, డెబ్యూ హీరోయిన్ కృతి శెట్టి క‌లిసి చేసిన మ్యాజిక్ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందించింది. దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం కూడా సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైంది. తాజాగా ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు రాబ‌ట్టింద‌ని మేక‌ర్స్ అఫీషియ‌ల్ పోస్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. ఉప్పెనంత ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు అని కామెంట్ పెట్టారు. ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో క‌నిపించిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీకి సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రశంసలు లభిస్తున్నాయి. నటసింహ నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఉప్పెన’ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూశారు. నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకుడు బుచ్చి బాబును ప్రత్యేకంగా అభినందించారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ పలుమార్లు ఈ సినిమా వంద కోట్ల సినిమా అని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇప్పుడు ఆయన మాట నిజమైంది. విజయంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టిన‘ఉప్పెన’ రీసెంట్‌‌గా రూ. వంద కోట్ల మార్క్ టచ్ చేసింది. ‘ఉప్పెనంత మీప్రేమకి ధన్యవాదాలు’ అంటూ తమ చిత్రం 100 కోట్ల గ్రాస్ సాధించిందని అధికారికంగా తెలియజేశారు మేకర్స్.