బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మోడల్ జెస్సి హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎంతో అద్భుతంగా టాస్క్ పాటిస్పేట్ చేశారు. అయితే జెస్సీ అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. తనకి హౌస్ లో ఉన్నన్ని రోజులు వర్టిగో సమస్యతో బాధ పడ్డాడని అతనికి మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పినపుడు బిగ్ బాస్ తప్పని సరి పరిస్థితులలో అతనిని హౌస్ నుంచి బయటకు పంపించారు.
ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఆరోగ్యం బాగా లేదని బయటకు వచ్చిన తర్వాత మాత్రం తన స్నేహితులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి తనను ఎందుకు బయటకు పంపారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే జెస్సీ తన స్నేహితులతో కలిసి విజయవాడలో పార్టీలు చేసుకోడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే జెస్సీ తనకు అనారోగ్యం చేసినప్పుడు విజయవాడలో చికిత్స తీసుకున్నారని తనకి అక్కడ చికిత్స చేయించుకున్న తరువాత తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు.
ఇలా జెస్సి ఆరోగ్య పరిస్థితి కుదుట పడడంతో ఈయన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో కలిసి పార్టీలు చేసుకోవడం, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం చేస్తున్నారు. అలా మొత్తానికి విజయవాడలో జెస్సీ కి అభిమానులు భారీ స్థాయిలో స్వాగతం పలికినట్టు తెలుస్తోంది. ఒకవేళ జెస్సీ ఆరోగ్య పరిస్థితి కుదుటపడి ఉండుంటే మరో కొన్ని వారాల పాటు హౌస్లో కొనసాగే వాడని అనుకోని పరిస్థితుల కారణంగా హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని తెలిపారు.