మహేష్ బాబు అందంపై ప్రశంసలు కురిపించిన జాన్వీ.. ఎలా సాధ్యమంటూ కామెంట్స్!

టాలీవుడ్ హీరో మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మహేష్ బాబు నటనకు మాత్రమే కాకుండా ఈయన అందానికి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా మహేష్ బాబుకి అబ్బాయిల కన్నా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని చెప్పాలి.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న మహేష్ బాబు అంటే కేవలం సాధారణ అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఆయనకు అభిమానులుగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు మహేష్ బాబుతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని కొందరు ఆశపడడం మరికొందరు మాత్రం ఆయన సినిమాలో చిన్న పాత్రలో అవకాశం వచ్చిన చాలు అని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు అంటే తనకు క్రష్ అంటూ బాలీవుడ్ నటి దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మహేష్ బాబు అందం గురించి ప్రశంసల కురిపించారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మహేష్ బాబు గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మహేష్ బాబు సర్ అందం చూస్తే కొరుక్కు తినేయాలనేంత క్రష్ అని తెలిపారు. సాధారణంగా ఎవరికైనా వయసు పైబడే కొద్ది అందం తగ్గుతుంది కానీ మహేష్ సార్ విషయంలో మాత్రం పూర్తిగా విభిన్నం ఈయనకు వయసు పైపడే కొద్ది మరింత అందంగా తయారవుతున్నారు అసలు ఇది ఎలా సాధ్యం అంటూ ఈమె షాక్ అయ్యారు.మహేష్ సార్ ని చూడగానే తను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియకుండా తన ఫేస్ మొత్తం బ్లాంక్ అవుతుందని ఈ సందర్భంగా మహేష్ బాబు అందం పై నటి ప్రశంసలు కురిపించారు.