జాన్వీ కపూర్ పై గాసిప్స్ ని ఖండించిన ఆమె తండ్రి.!

బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్నటువంటి మోస్ట్ యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్స్ లో అలనాటి అందాల నటి అయినటువంటి శ్రీదేవి కూతురు అయినటువంటి జాన్వి కపూర్ కూడా ఒకరు. అయితే ఈ యంగ్ నటి కేవలం తన గ్లామ్ షో తోనే కాకుండా పలు చిత్రాల్లో నటిగా కూడా కనిపించి మెప్పించింది.

కాగా ఈ ఎంట్రీ అయితే సౌత్ ఇండియా సినిమా దగ్గర ఎప్పుడు ఉంటుందా అని ఎప్పుడు నుంచో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తన 30 వ సినిమాలో ఈమెనే హీరోయిన్ గా ఉంటుంది అని గట్టి టాక్ వచ్చింది.

అయితే అప్పుడు ఎలాంటి స్పందన తన టీం నుంచి లేదు కానీ ఈమె తమిళ్ సినిమాలో ఓ సినిమా సైన్ చేసి ఎంట్రీ ఇవ్వబోతుంది అనే గాసిప్స్ పెద్ద ఎత్తున వైరల్ గా మారగా ఈ వార్తలపై స్వయంగా జాన్వీ తండ్రి అలాగే బాలీవుడ్ నిర్మాత అయినటువంటి బోనీ కపూర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

“మీడియా వారికి తెలియజేస్తుంది ఏమిటంటే ఈ జాన్వీ తమిళ్ లో సినిమా కమిట్ అయ్యినట్టుగా వార్తలు నా దృష్టికి వచ్చాయని కానీ తాను ప్రస్తుతం సౌత్ లో ఎలాంటి తమిళ్ సినిమాలకి కమిట్మెంట్ ఇవ్వలేదని తెలియజేస్తున్నానని అలాగే ప్రతి ఒక్కరిని ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చెయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తున్నానని” తెలిపారు. దీనితో జాన్వీ కపూర్ పై వచ్చిన వార్తలపై తన తండ్రి నుంచే క్లారిటీ వచ్చింది. 
https://twitter.com/BoneyKapoor/status/1621374970864746496