James : కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని ఇంకా అందరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన చనిపోయిన రోజు నుండి నేటి వరకు ఏదో ఒక సందర్భంలో ఆయనను తలుచుకుంటూనే ఉన్నారు. ఇక ఆయన నటించినా చివరి చిత్రం జేమ్స్ ఆయన పుట్టినరోజు సందర్బంగా మార్చి 17 న విడుదలైంది. కన్నడ నాట మార్చి 25 వరకు మరే సినిమా విడుదల చేయకుండా కేవలం జేమ్స్ సినిమాను మాత్రమే థియేటర్స్లో వేసి పునీత్ రాజ్ కుమార్ కు నివాళి ఇచ్చారు కన్నడ చిత్ర సీమ.
ఇక ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్‌తో ఎగ్జిబిటర్లలను జేమ్స్ దర్శకుడు అభ్యర్ధించారు. కర్నాటకలో ఈ సినిమా వసూళ్ళు బాగా ఉన్నాయి. అయితే, దర్శకుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ విడుదలైతే జేమ్స్ సినిమా వసూళ్ళపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అందుకే, దివంగత నటుడు మరియు జేమ్స్ దర్శకుడు చేతన్ కుమార్ అభిమానులు ఆర్ఆర్ఆర్ మూవీ కోసం థియేటర్ల నుండి జేమ్స్ సినిమాను తీసివేయవద్దని డిస్ట్రిబ్యూటర్లును అలాగే ఎగ్జిబిటర్లను అభ్యర్థించారు.
2 వ వారంలో కూడా జేమ్స్ మంచి వసూళ్లను రాబట్టింది. అందుకే, ఈ సినిమాను ఇప్పుడే తీసివేయవద్దని ఎగ్జిబిటర్లకు విజ్ఞప్తి చేస్తూ దర్శకుడు తాజాగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో ఆయన.. రాజ్‌కుమార్ అభిమానుల భావోద్వేగాలను గౌరవించాలని కూడా అభ్యర్థించారు. పునీత్ రాజ్‌కుమార్‌కి జేమ్స్ చివరి కమర్షియల్ సినిమా అని, జేమ్స్ సినిమా కాదని, ఎమోషన్ అని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ కర్ణాటకతో సహా అన్ని చోట్ల అత్యంత భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మరి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.