ఇన్సైడ్ టాక్ : “భగవంత్ కేసరి”లో “జైలర్” మాదిరి ఓ ఊహించని సీక్వెన్స్??

ఇప్పుడు దసరా కానుకగా టాలీవుడ్ సినిమా దగ్గర ఆల్రెడీ భారీ పండుగ వాతావరణం మొదలైంది. ఈ వారం సినిమాలతో అయితే టాలీవుడ్ లో తెలుగు సహా పలు డబ్బింగ్ చిత్రాలతో వస్తుండగా వాటిలో టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం “భగవంత్ కేసరి” కూడా ఒకటి.

మరి ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అని ఆల్రెడీ టాక్ స్టార్ట్ కాగా ఈ సినిమా విషయంలో అయితే ఇప్పుడు ఓ క్రేజీ గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. దీనితో అయితే ఈ చిత్రంలో రీసెంట్ తమిళ భారీ హిట్ చిత్రం “జైలర్” తరహాలో ఉండే ఓ ఊహించని సీక్వెన్స్ ఉంటుందట.

కాగా ఇన్ని రోజులు బాలయ్య రెండు భిన్నమైన షేడ్స్ లోనే కనిపిస్తాడు అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ కనిపించని ఆ మూడో షేడ్ కూడా ఉందట. అదే ఆ డైలాగ్ కి తగ్గ రోల్ పోలీస్ రోల్. సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అయితే బాలయ్య సుమారు పది పదిహేను నిమిషాలు అలా పోలీస్ గెటప్ లో కనిపించనున్నారట.

మరి జైలర్ లో కూడా రజిని కనిపించిన ఆ కొన్ని నిమిషాలు థియేటర్స్ దద్దరిల్లాయి. మరి భగవంత్ కేసరిలో కూడా ఏఈ టైప్ సీక్వెన్స్ అంటున్నారు మరి చూడాలి ఇది నిజంగా ఉందొ లేదో అనేది. ఇక ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల బాలయ్య కూతురు రోల్ లో నటించింది. థమన్ సంగీతం సమకూర్చాడు.