Godari Gattupaina: సుమంత్ ప్రభాస్, గోదారి గట్టుపైన ఎంటర్టైనింగ్ & ట్రూలీ గోదావరి-రూటెడ్ టీజర్ లాంచ్

Godari Gattupaina: మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోదారి గట్టుపైన ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు.

గోదావరి తీర ప్రాంతం నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం, గ్రామీణ జీవితంలోని ఉత్సాహాన్ని ‘ఆస్కార్rrrr గ్యాంగ్’గా పాపులరైన ఫ్రెండ్స్ గ్యాంగ్ ద్వారా ఆకట్టుకునేలా చూపించారు. సుమంత్ ప్రభాస్ రాజు పాత్ర సరదా మనస్తత్వం కలిగిన యువకుడిగా కనిపించారు. అతని జీవితంలో మాయ (నిధి ప్రదీప్) రావడంతో మొదలయ్యే ప్రేమకథ జాలీగా, హ్యుమర్, స్నేహం–పండుగ వాతావరణాల మధ్య ఆహ్లాదంగా సాగుతుంది.

వైబ్రెంట్ విజువల్స్‌తో నిండిన టీజర్‌లో స్నేహితుల గ్యాంగ్ మధ్య కెమిస్ట్రీ, లీడ్ జంట మధ్య పుట్టే హార్ట్ టచ్చింగ్ రొమాన్స్‌ను అందంగా చూపించారు. హాస్యం, ప్రేమ, భావోద్వేగాలను మేళవిస్తూ దర్శకుడు సుభాష్ చంద్ర కొత్తదనంతో కూడిన హార్ట్‌వార్మింగ్ కథనాన్ని అందించారు.

సుమంత్ ప్రభాస్ సహజంగా రాజు పాత్రలో ఒదిగిపోయాడు. అతని కామిక్ టైమింగ్ ఆకట్టుకుంటుంది. నిధి ప్రదీప్ అందంగా కనిపించింది. జగపతి బాబు, రాజీవ్ కనకాల పాత్రలు సినిమా డెప్త్ ని పెంచుతాయి. సుదర్శన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తమ హ్యుమర్ తో నవ్వులు పూయిస్తారు.

సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ గోదావరి ప్రాంతాన్ని సహజత్వంతో, కళ్లకు విందుగా చూపిస్తే, నాగ వంశీ కృష్ణ సంగీతం సినిమాకు పర్ఫెక్ట్ లైట్ & బ్రీజీ గ్రామీణ వాతావరణాన్ని అందిస్తుంది. ప్రొడక్షన్ విలువలు బలంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్‌గా ప్రవాళ్య, ఎడిటర్‌గా అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైనర్‌గా నాగార్జున తల్లపల్లి అద్భుతమైన వర్క్ ఇచ్చారు. యూత్‌ఫుల్ ఎనర్జీ, రూటెడ్ విజువల్స్, గోదారి గట్టుపైన స్నేహం, ప్రేమని సెలబ్రేట్ చేసుకునే ఫీల్-గుడ్ రూరల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులని అలరించనుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్లో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. అందరికి నమస్తే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా రోజుల తర్వాత ఈ స్టేజ్ పైకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఫస్ట్ టైం గోదావరి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అర్థమైంది గోదావరి అంటే జస్ట్ ఒక ప్రాంతం కాదు అది ఒక కల్చర్ ఎమోషన్. ఆ ఫీలింగ్ వేరు. అక్కడ ప్రజలు మాట్లాడే విధానం చాలా స్వీట్ గా ఉంటుంది. వాళ్ల మర్యాద కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కేరళ కంటే చాలా అద్భుతమైన లొకేషన్స్ గోదావరి ప్రాంతంలో ఉన్నాయి. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ సినిమాకు ముందు దాదాపుగా 80 కథలు విన్నాను. డైరెక్టర్ సుభాష్ ఈ కథని చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. తను దాదాపుగా వంద షార్ట్ ఫిలిం చేశాడు. అది మామూలు విషయం కాదు. ప్రతి ఫిల్మ్ చాలా క్వాలిటీగా ఉండేది. అవి చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. నా సెకండ్ సినిమాకి ఆయన డైరెక్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఒక కిటికీ నుంచి పల్లెటూరిని చూసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. నేను తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగాను. నాకు గోదావరి యాస పలకడం నిజంగా ఒక సవాల్. డైరెక్టర్ నన్ను చాలా బాగా ట్రైన్ చేశారు. మీరు గాని టికెట్ కొని థియేటర్లో కూర్చుంటే గోల్డెన్ అవర్ లో గోదావరి పడవ ఎక్కినట్టుగా ఉంటుంది.సినిమా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మా నిర్మాతకి థాంక్యూ. చాలా ఫ్యాషన్ తో చాలా క్వాలిటీతో తీశారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మాయ క్యారెక్టర్ లో నటించడం ఒక పెద్ద సవాల్ గా అనిపించింది. మాయాలోన ప్రతి ఒక్క భావోద్వేగాన్ని సరికొత్తగా బయటకి తీసుకొచ్చారు మా డైరెక్టర్. ఆయన శైలి చాలా ప్రత్యేకం. నన్ను నేను ఒక ఉత్తమ నటిగా మల్చుకోవడానికి మా డైరెక్టర్ చాలా మద్దతుగా నిల్చున్నారు. మాయ క్యారెక్టర్ నాకు చాలా దగ్గరగా అనిపించిన పాత్ర. చాలామంది అమ్మాయిలు మాయ క్యారెక్టర్ని రిలేట్ చేసుకుంటారు. ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్రను మీరు ఇష్టపడతారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఒక చల్లటి సాయంత్రాన గోదావరి గట్టున కూర్చుని నలుగురు స్నేహితులు కబురులు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుందని సినిమా లాంచింగ్ రోజు చెప్పాను. అదే మాటకు తీసుకొచ్చి మేము చేసిన ప్రయత్నమే ఈ సినిమా. టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథని మొదటి నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ అభినవ్ గారు. నన్ను, కథని నమ్మి ఇంత అద్భుతంగా సినిమాని తీశారు. ఇది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కథ. ఇందులో ఉండే ఫ్రెండ్స్ గ్యాంగ్ మీ అందరినీ అలరిస్తారు. కచ్చితంగా ఈ సినిమాని మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు.

రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ.. గోదారి ప్రాంతంలో ఉన్న అందరికీ ఈ సినిమా చాలా క్లోజ్ గా కనెక్ట్ అవుతుంది. రాజావారు రాణి వారు చేసిన తర్వాత ప్యూర్ గోదావరి సినిమా చేయమని చాలా మంది అడిగారు. ఇప్పుడు ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా లైవ్ లో గోదావరిని ఎక్స్పీరియన్స్ చేసినట్టుగానే ఉంటుంది. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ. అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.

తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – సుభాష్ చంద్ర
బ్యానర్ – రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత – అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక
DOP – సాయి సంతోష్
సంగీతం – నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ – అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య డి
PRO – వంశీ-శేఖర్
మార్కెటింగ్ – ఫస్ట్ షో

అసెంబ్లీలో సీతక్క,KTR మాటల యుద్ధం || Seethakka Vs KTR || Telangana Assembly Today || Telugu Rajyam