సింగర్ మంగ్లీకి కీలక పదవి ఇచ్చిన జగన్ సర్కార్.. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగిస్తూ ఉత్తర్వులు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జగన్ సర్కార్ తన పార్టీ కోసం ఎంతగానో కృషించిన వారి సేవలను మర్చిపోకుండా వారికి కీలకమైన పదవులను అందిస్తోంది.ఇక ఈ పార్టీ కోసం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నో సేవలు అందించిన వారి సేవలను గుర్తించిన జగన్ ప్రభుత్వం వారికి ఇప్పటికే పలు కీలకమైన పదవులను కట్టబెడుతుంది. ఇప్పటికే ఆలీ పోసాని వంటి వారికి మంచి పదవులను ఇచ్చినటువంటి జగన్ ప్రభుత్వం తాజాగా సింగర్ మంగ్లీ కి సైతం తన ప్రభుత్వంలో కీలకమైన పదవిని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ బోనాల పాటలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీ అనంతరం సినిమా పాటల ద్వారా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక గత ఎన్నికలలో భాగంగా ఈమె వైఎస్ఆర్సిపి ప్రచార కార్యక్రమాలలో పార్టీ గురించి పెద్ద ఎత్తున పాటలను ఆలపించిన విషయం మనకు తెలిసిందే. ఇలా జగన్ పార్టీ కోసం మద్దతు పలికినటువంటి ఈమె సేవలను గుర్తించిన జగన్ సర్కార్ మంగ్లీకి కీలక బాధ్యతలను అప్పగించింది.

ఈ క్రమంలోనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు అడ్వైజర్ గా మంగ్లీ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు సంవత్సరాల పాటు ఈమె ఈ పదవిలో కొనసాగుతూ ఉండటమే కాకుండా, నెలకు లక్ష రూపాయలు చొప్పున జీతభత్యాలను చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా జగన్ ప్రభుత్వం మంగ్లీకి కీలక పదవులు ఇవ్వడంతో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక చిత్ర పరిశ్రమలో ఆలీ పోసాని వంటి వారి తర్వాత మంగ్లీ కి ఇలాంటి పదవి రావడం విశేషం.