గతంలో 100 రూపాయాలు కూడా లేక అలా చేశాను : హైపర్ ఆది

jabardasth show will be completed 400 episodes on dec 24

జబర్దస్త్…గత ఏడు ఏళ్లగా టాప్ కామెడీ షో గా కొనసాగుతుంది. ఈ షో టీఆర్పీ చూసి మిగిలిన ఛానెల్స్ అలాంటి కామెడీ షోస్ చేసినా ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఏ ఛానెల్ ప్రారంభించిన కేవలం నెలలలో షో కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు.అందుకు కారణం ఈ షోలో వెరైటీ స్క్రిప్ట్స్, పేలే పంచ్ లు మంచి కామెడీతో జబర్దస్త్ ని నిజంగా జబర్దస్త్ షో చేశారు.ఇక ఈ షోలో చేసిన చాలామందికి మంచి పాపులారిటీ , డబ్బు వచ్చింది. అలా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్స్ లో టాప్ లో హైపర్ ఆది ఉన్నారు .అది జీవితం జబర్దస్త్ తో టర్న్ అయ్యిందని చెప్పుకోవాలి.హైపర్ అదిని గుర్తించి తన టీం లో కి తీసుకుని అతన్ని ఎంకరేజ్ చేసింది అదిరే అభి. మెల్ల మెల్లగా టీం మెంబెర్ నుండి టీం కెప్టెన్ గా ఎదిగాడు.

jabardasth show will be completed 400 episodes on dec 24
jabardasth show

టీమ్ లీడర్ గా కొనసాగుతూ తనకంటూ ఓ మంచి పేరు తెచ్చుకున్న అదిరే అభి హైపర్ ఆది ట్యాలెంట్ చూసి తన స్కిట్ లో ఒక చోటా అవకాశం ఇచ్చాడు.ఇక అదిరే అభి స్కిట్స్ లో హైపర్ ఆది చేసిన పర్ఫార్మెన్స్ చుసిన జబర్దస్త్ షో నిర్వాహకులు హైపర్ ఆదినే టీమ్ లీడర్ గా చేశారు.అలా హైపర్ ఆది ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు.అయితే ఇప్పుడు జబర్దస్త్ 400వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటుంది. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. జబర్దస్త్ కు ముందు వారి జీవితాల్లో ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది వారు ఈ లెపిడోసే లో చెప్పినట్లుగా ప్రోమో లో ఉంది. యాంకర్ అనసూయ నుంచి కమెడియన్స్ వరకు అందరూ వారి కష్టాలను ఈ ఎపిసోడ్ లో చెప్పుకున్నారు.

Jabardasth | 24th December 2020 | 400th Episode Special | Latest Promo | ETV Telugu

ఇక అలానే హైపర్ అది కూడా తన కష్టాలను చెప్పుకొచ్చాడు.ఈ షో కు రాకముందు ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడినట్టు.వంద రూపాయిల కోసం పక్కింటికి వెళ్లి అడిగే పరిస్థితి అని.కానీ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నట్టు దానికి కారణం జబర్దస్త్ అని, జబర్దస్త్ లో ఉండడానికి కారణం అభి అని, అన్న రుణం ఎప్పటికి తీర్చుకోలేను అని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.