ప్రస్తుతం సెలెబ్రిటీలందరికీ ఓ పెద్ద తలనొప్పిగా మారిన విషయం ఒకటి ఉంది. ఈ మధ్య ఫేస్ బుక్‌లో కొత్తరకమైన సమస్యలు వచ్చాయి. ఊరికే ఖాతాలను హ్యాక్ చేసేస్తున్నారు. ఫేక్ ప్రొఫైల్‌లతో ఇతరులను డబ్బులు అడుగుతున్నారు.. ఇతర మోసాలకు పాల్పడుతున్నారు. ఇవి సెలెబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు అందరికీ తలనొప్పిగా మారింది. మరీ ముఖ్యంగా ఇలాంటివి సెలెబ్రిటీలపై మరింత ప్రభావం పడుతుంది.
తాజాగా రాం ప్రసాద్ ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశాడు. ఇది వరకు కూడా ఇదే విషయాన్నిచెప్పాడట. తన ఫేస్ బుక్ హ్యాక్ అయిందని, ఎవరో కొందరు మెసెజ్‌లు పెడుతున్నారట.. నంబర్లు, ఫోటోలు అడుగుతున్నారట అంటూ వాపోయాడు. ఈ మేరకు రాం ప్రసాద్ మాట్లాడిన మాటలు షేర్ చేసిన వీడియో బాగానే వైరల్ అవుతోంది. ఇంతకీ రాం ప్రసాద్ షేర్ చేసిన వీడియోలు ఉన్న సారాంశం ఏంటంటే..
నేను మీ జబర్దస్త్ రాం ప్రసాద్.. నా ఫేస్ బుక్‌ను ఎవరో రీసెంట్‌గా హ్యాక్ చేశారు.. ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని చెప్పాను.. ఇది రెండో సారి.. నా పేజ్ నుంచి చాలా మందికి రిక్వెస్ట్‌లు వెళ్తున్నాయట.. ఫోన్ నెంబర్లు, ఫోటోలు అడుతున్నారట.. దయచేసి వాటికి రియాక్ట్ అవ్వకండి.. నా పేజీని ఫాలో అవ్వండి.. నా పిక్స్‌కు లైక్ కొట్టండి.. నా పేజీ నుంచి గానీ, ఫేస్ బుక్ నుంచి గానీ మెసెజ్‌లు వస్తే మాత్రం రియాక్ట్ కావొద్దంటూ రాం ప్రసాద్ కోరాడు.