రాకేష్ మాస్టర్‌ను వాడేస్తున్నాడు.. అలా పరువుదీస్తోన్న జబర్దస్త్ నరేష్

Jabardasth Naresh imitates rakesh Master

యూట్యూబ్‌ను ఓ ఊపు ఊపేశాడు రాకేష్ మాస్టర్. టాలీవుడ్ ఇండస్ట్రీపై, సినీ పెద్దలపై సంచలన కామెంట్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు రాకేష్ మాస్టర్. ఇండస్ట్రీలో ఎంతో కాలం నుంచి ఉన్నా కూడా జనాలకు అంతగా తెలియదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా రాకేష్ మాస్టర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ సెలెబ్రిటీగా మారాడు. రాకేష్ మాస్టర్ అంటే తెలియని తెలుగు సినీ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు.

Jabardasth Naresh imitates rakesh Master
Jabardasth Naresh imitates rakesh Master

ఎందుకంటే రాకేష్ మాస్టర్ గెలకని హీరో లేడు. అందరి హీరోలను ఏకిపారేశాడు.. వారి ఫ్యాన్స్‌ను కూడా ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. హీరోల ఫ్యాన్స్ సైతం రాకేష్ మాస్టర్‌ను ఆడుకున్నారు. హత్య చేస్తామని, కొడుకును చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే రాకేష్ మాస్టర్ పుల్లయ్య అనే వ్యక్తిని చేరదీశాడు. తనలానే హెయిర్ స్టైల్ కట్ చేసుకోవడం, వీరాభిమాని అని చెప్పడంతో పుల్లయ్యని హీరోగా చేస్తానని మాటిచ్చాడు. అందులో భాగంగా పుల్లయ్యకు బాగానే డ్యాన్స్ నేర్పించేందుకు రాకేష్ మాస్టర్ తంటాలు పడ్డాడు.

ఆ గురు శిష్యుల డ్యాన్స్ క్లాసుల వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. అదే కాన్సెప్ట్‌ను అదే వీడియోలను వాడి జబర్దస్త్ నరేష్ స్కిట్స్ చేస్తూ వస్తున్నాడు. రాకేష్ మాస్టర్‌లానే హెయిర్ కట్ చేయించుకోడం, గుండు గీయించుకుని స్కిట్ వేశాడు. అది బాగానే క్లిక్ అయింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ రాకేష్ మాస్టర్‌ను వాడేశాడు. అతనిలా స్టెప్పులు వేస్తూ కామెడీ చేశాడు. మొత్తానికి జబర్దస్త్ నరేష్ రాకేష్ మాస్టర్‌ను బాగానే వాడేస్తున్నాడు.