Jabardasth: జబర్దస్త్ కు కష్టాలు.. దారుణంగా పడిపోయిన టీఆర్పీ రేటింగ్స్.. షోను ఆపాల్సిందేనా?

jabardasth comedy show getting very low trps because of bigg boss

జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో.. అంటూ బుల్లితెర అభిమానులను అలరిస్తోంది జబర్దస్. అది వచ్చి ఏడేళ్లు అయినా ఇప్పటి వరకు టెలివిజన్ చరిత్రలోనే దాన్ని అందుకున్న మరో షో లేదు. ఎన్ని కార్యక్రమాలు వచ్చినా.. ఎన్ని షోలు వచ్చినా దాని ముందు బలాదూర్. టీఆర్పీ రేటింగ్స్ లో రివ్వున దూసుకెళ్తూ అందరికీ ఎంటర్ టైన్ మెంట్ ను ఇచ్చింది జబర్దస్త్.

jabardasth comedy show getting very low trps because of bigg boss
jabardasth comedy show getting very low trps because of bigg boss

అయితే.. అన్ని రోజులు ఒకే తీరుగా ఉండవు కదా. పరిస్థితులు మారాయి. ప్రస్తుతం ఏ ఫీవర్ నడుస్తుందో అందరికీ తెలుసు. ఓ వైపు బిగ్ బాస్ సీజన్ 4 నడుస్తుండగా.. మరో వైపు ఐపీఎల్.

ఈ రెండు పెద్ద ఈవెంట్లే. దీంతో జబర్దస్త్ కు ఎక్కడలేని కష్టాలు వచ్చి పడ్డాయి. బిగ్ బాస్ స్టార్ట్ కాగానే.. జబర్దస్త్ రేటింగ్ అప్పటి కంటే కొంచెం తగ్గాయట. ఇక.. ఐపీఎల్ కూడా ప్రారంభం కాగానే.. జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయట.

అటు ముందుకు పోలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక.. ఏం చేయాలో తెలియని స్థితిలో జబర్దస్త్ నిర్వాహకులు ఉన్నారని తెలుస్తోంది.

అయితే.. బిగ్ బాస్, ఐపీఎల్ ను తట్టుకొని నిలబడాలంటే జబర్దస్ లో కాస్త డోస్ పెంచాలని భావించారట నిర్వాహకులు. కనీసం… బిగ్ బాస్, ఐపీఎల్ అయిపోయే వరకు అయినా.. జబర్దస్త్ ను కాపాడుకోవాలంటే.. ఖచ్చితంగా స్కిట్లలో డోస్ పెంచాలని నిర్ణయించుకున్నారట. అందుకే.. దాని కోసమే టీమ్ లీడర్లకు ఎక్స్ ట్రా టాస్కులు ఇచ్చారట. స్కిట్లలో డోస్ ఎక్కువగా ఉండాలని… కాంట్రవర్సీలు ఉన్నా పర్లేదని.. చెప్పారట. ఎలాగైనా స్కిట్లు అదిరిపోవాలని.. అలాంటి ప్రోమోలు వేసి ఎలాగైనా ప్రేక్షకులను తమవైపుకు తిప్పుకునేందుకు జబర్దస్త్ టీం తెగ ప్రయత్నాలు చేస్తోందట. లేకపోతే జబర్దస్త్ షో ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆలోచించి.. ఇటువంటి నిర్ణయం తీసుకున్నారట. చూద్దాం మరి.. వచ్చే ఎపిసోడ్స్ లో అయినా ఎక్స్ ట్రా మసాలాలు గట్రా ఏమైనా యాడ్ చేస్తారో?