మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఇకనైనా బిగ్‌బాస్ షో ‘జబర్దస్త్’గా ఉంటుందా?

Jabardasth Avinash Wild Card ENtry In Bigg Boss 4 Telugu

బిగ్ ‌బాస్ 4 షో రెండో వారంలో ఓ మోస్తరుగా ముందుకు వెళ్తోంది. ఈ సీజన్‌ను పరుగులు పెట్టించేందుకు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టబోతోన్నాడు బిగ్‌బాస్ 4. ఇప్పటికే ఓ ఎలిమినేషన్ (సూర్య కిరణ్), ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ (కుమార్ సాయి) జరిగింది. కుమార్ సాయి రావడం వల్ల ఇంట్లో ఎలాంటి మార్పులు రాలేదు. కనీసం అతను ఉన్నాడన్నది కూడా ఎవ్వరూ గుర్తించడం లేదు. మిగతా ఇంటి సభ్యులతోనూ అంతగా కలిసి పోవడం లేదు. అతను కలవాలని చూసినా మిగతా సభ్యులెవరూ అంతగా సుముఖత చూపించడం లేదు.

Jabardasth Avinash Wild Card ENtry In Bigg Boss 4 Telugu
Jabardasth Avinash Wild Card ENtry In Bigg Boss 4 Telugu

అందుకే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ప్రోమోలో వాయిస్.. జోకర్ అంటూ సంబోధించడం చూస్తుంటే అది జబర్దస్త్ అవినాష్ అని ఇట్టే తెలిసిపోతోంది. ఇక జబర్దస్త్ అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోన్నాడని ఎప్పటి నుంచో లీకులు వస్తూనే ఉన్నాయి. మొత్తానికి ఆ వార్తలు నేడు నిజమయ్యాయి. జబర్దస్త్ అవినాష్ నేటి ఎపిసోడ్‌లో ఇంట్లోకి ఎంట్రీ ఇశ్వబోతోన్నాడు.

Jabardasth Avinash Wild Card ENtry In Bigg Boss 4 Telugu
Jabardasth Avinash Wild Card ENtry In Bigg Boss 4 Telugu

మరి రెండు మూడు రోజుల గ్యాప్‌తోనే ఇంట్లోకి వచ్చిన సోహెల్, ఆరియానాలను ఇంకా అందరూ నమ్మడం లేదు. దగ్గరికి తీసుకోవడం లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయిని దూరంగానే పెడుతున్నారు. మరి జబర్దస్త్ అవినాష్ పరిస్థితి ఎలా ఉంటుందో? అందరూ మాట్లాడుతారా? లేదా అందరికీ తానే కలిసిపోవడానికి ప్రయత్నిస్తాడా? అన్నది చూడాలి. కనీసం అవినాష్ ఎంట్రీతోనైనా షోలో అనూహ్య మార్పులు సంభవిస్తాయేమో చూడాలి.