సమంత ఈ సినిమా రీమేక్ చేస్తే సూపర్ ఉంటుంది ..ట్రెయిలర్ భలే ఉందే ..!

సమంత వెబ్ సిరీస్ చేసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసందే. అందుకే డెబ్యూ వెబ్ సిరీస్ అయిన ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో నటించింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ లో సమంత పోషించేది కూడా నెగిటివ్ రోల్ అని చాలా ఇంట్రెస్ట్ గా సాగుతుందని అంటున్నారు. వాస్తవంగా ఫ్యామిలీ మాన్ సీజన్ 2 ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేయాల్సింది. కాని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి కూడా కొంత వీఎఫెక్స్ వర్క్ పెండింగ్ ఉండటం తో మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ త్వరలో ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 ని రిలీజ్ చేసే డేట్ ని ప్రకటించనున్నారు. ఇక ఇందులో నేషనల్ అవార్డ్ విన్నర్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి.. మనోజ్ బాజ్‌ పేయి పై కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

అయితే ఇప్పుడు అలాంటి మరో సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ చూసిన అందరూ సమంత నటిస్తే బావుండేదని చెప్పుకుంటున్నారు. వెబ్ సిరీస్ కాకపోయినా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అదే బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా నటించిన ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ సినిమా. రిభూ దాస్ గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందగా.. అదితిరావు హైదరి మరో హీరోయిన్ గా నటించింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం ‘నెట్ఫ్లిక్స్’లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

కాగా ఈ సినిమాని ఫిబ్రవరి 26 న స్ట్రీమింగ్ లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మర్డర్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో సైకో థ్రిల్లర్ ఈ సినిమాని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ అనే పేరుతో వచ్చిన నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అంతేకాదు నవల పేరే సినిమాకి పెట్టడం విశేషం. ఇక తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమా మీద విపరీతంగా ఆసక్తిని పెంచేశారు చిత్ర బృందం. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ వస్తుందో. ఇక పరిణీతి చోప్రా సైనా నెహ్వాల్ బయోపిక్ లో కూడా నటిస్తోంది.