Health Tips: వేసవికాలం మొదలైనప్పటి నుంచి రోజురోజుకి ఎండ తీవ్రత పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేసవికాలంలో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి అవసరమైన ఆహార పదార్థాలను మాత్రమే మనం తీసుకోవాలి. వేసవిలో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటానికి అధిక మోతాదులో నీరు త్రాగడం చాలా అవసరం. శరీరానికి నీటిశాతం ఎక్కువగా కలిగి ఉన్న పండ్లు, పళ్ళ రసాలు, మజ్జిగ వంటి వాటిని తరచూ తీసుకోవటం చాలా అవసరం. వేసవి కాలంలో శరీరానికి సెలవా నిచ్చే కొన్నిరకాల ఆహార పదార్థాలు ఆకుకూరలు కూరగాయలు తీసుకోవాలి. అంతే కాకుండా ఈ వేసవి కాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది.
వేసవికాలంలో బయట తిరిగి వేడికి తాళలేక ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిజ్ లో బాగా చల్లగా ఉన్న నీరు తాగటం చాలా ప్రమాదం.ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గటం అటుంచితే ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. దీని కారణంగా న్యూమోనియా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వేసవి కాలంలో కాఫీ, టీ, డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, ఆల్కహాల్, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ఎలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.అంతేకాకుండా వేసవి కాలంలో ఎక్కువగా మామిడి పళ్ళు తినటానికి ఆసక్తి చూపుతూ ఉంటాడు.వేసవికాలంలో మామిడి పండ్లు ఎక్కువగా తినటం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉంది.