ఆ స్టార్ క్రికెటర్ బయోపిక్ కి సరిగ్గా సరిపోతానంటున్న విజయ్ దేవరకొండ..?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మారిన విజయ్ ఆ సినిమా హిట్ అవ్వడంతో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత విజయ్ నటించిన గీతాగోవిందం అర్జున్ రెడ్డి సినిమాలు కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. దీంతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయి రౌడీ హీరో అన్న గుర్తింపు దక్కించుకున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేక డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ అండ్ టీం చేసిన హడావిడి కి సినిమా భారీ స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సినిమా విడుదలైన తర్వాత డిజాస్టర్ గా నిలవటంతో నెటిజన్స్ విజయ్ మీద తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే సినిమా ప్లాప్ అయినా కూడా విజయ్ ఏ మాత్రం నిరాశ చెందకుండా చాలా హుషారుగా తన తదుపరి సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమాతో పాటు సమంతతో కలిసి ఖుషి సినిమాలో కూడ నటిస్తూ బిజీగా ఉన్నాడు.అయితే ఇటీవల దుబాయ్ లో జరిగిన ఇడియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ను చూడటానికి దుబాయ్ వెళ్ళిన విజయ్‌ ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు కామెంటర్స్‌ తో ముచ్చటించి విజయ్ ఒక స్టార్ క్రికెటర్ బయోపిక్ సినిమాలో నటించాలని ఆశపడుతున్నట్లు వెల్లడించాడు.ఈ సందర్భంగా క్రికెట్ ఆటతో తనకున్న అనుభవాలను విజయ్ వెల్లడించిన తర్వాత ప్రీ మ్యాచ్ షోలో అవకాశం వస్తే ఏ క్రికెటర్ బయోపిక్‌లో నటించాలనుందని కామెంటర్స్ ప్రశ్న వేశారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘ధోని భాయ్‌ బయోపిక్‌ చేయాలని ఆశగా ఉండేది. కానీ ఆయన బయోపిక్‌ను సుశాంత్‌ సింగ్‌ చేశాడు. అందువల్ల కోహ్లి అన్న బయోపిక్‌లో నటించాలనుంది. అలా బయోపిక్ లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. కోహ్లీ పాత్రకు నేను అయితే కరెక్ట్‌ గా సూట్‌ అవుతాను అనిపిస్తోంది’ అంటే విజయ్ వెల్లడించాడు.