ఐశ్వర్య ధనుష్ తిరిగి కలుసుకోవడానికి ఇదే కారణమా.. మంచి నిర్ణయం అంటూ?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత విడిపోవడం సర్వసాధారణంగా జరిగే అంశం.ఇలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు తీసుకొని విడిపోయిన వారు ఉన్నారు.ఇలా విడాకులతో విడిపోయిన కొందరు ఒంటరిగా గడుపుతుండగా మరికొందరు రెండవ పెళ్లి చేసుకున్నారు. కానీ మొదటిసారి విడాకులు తీసుకొని విడిపోయి తిరిగి కలుసుకున్న జంట కోలీవుడ్ నటుడు ధనుష్ ఐశ్వర్య జంట అని మాత్రమే చెప్పాలి.

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ధనుష్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 18 సంవత్సరాల క్రితం ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న ఈ దంపతులు ఈ 18 ఏళ్లలో వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారో వీరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి ఐశ్వర్య ధనుష్ ఈ ఏడాది జనవరి 17వ తేదీ విడాకులు తీసుకొని విడిపోతున్నామంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు.

ఈ విధంగా వీరిద్దరు విడాకులు ప్రకటన చేయడంతో ఎంతోమంది వీ గల కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రజినీకాంత్ కూడా ఈ జంటను తిరిగి కలపాలని ప్రయత్నం చేసిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.అయితే తాజాగా వీరిద్దరూ తమ విడాకులను వెనక్కి తీసుకోబోతున్నారని తిరిగి ఒక్కటి కాబోతున్నారని వార్త వినపడుతోంది.ఈ విధంగా వీరిద్దరు తిరిగి ఒకటి కావడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే కేవలం తన పిల్లలు రజనీకాంత్ అని మాత్రమే. రజనీకాంత్ వీరి విషయంలో ఎంతో ఆవేదన చెందుతున్నారని అలాగే ఇద్దరు విడిపోవడం వల్ల పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఉద్దేశంతో వీరి విడాకుల ఆలోచనను వెనక్కి తీసుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ గుడ్ న్యూస్ ఈ సెలబ్రిటీలు తెలియజేయబోతున్నారు.