ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ హైప్ తో ఉన్న బిగ్గెస్ట్ సీక్వెల్ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్” అనే చెప్పాలి. బన్నీ కెరీర్ ని పాన్ ఇండియా వైడ్ గా మలుపు తిప్పిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ అయితే తెరకెక్కించారు.
అయితే పుష్ప 1 బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. కానీ ఈ సినిమా పార్ట్ 2 తో అయితే ఫస్ట్ గ్లింప్స్ లో ఊహించని టర్న్ ని మేకర్స్ చూపించారు. పుష్ప జైలుకి వెళ్లడం అక్కడ నుంచి తప్పించుకొని ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి సినిమా వెళ్ళిపోయింది. దీనితో అసలు ఫస్ట్ పార్ట్ కి సంబంధం లేకుండా తీసేస్తున్నారా ఏంటి అని అనుమానం చాలా మందికి కలిగి ఉండొచ్చు.
అయితే ఇదే సమయంలో ఫస్ట్ పార్ట్ లో కనిపించిన స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ని తీసేసారా అంటూ కూడా టాక్ వచ్చింది. ఫహద్ పాత్ర తప్పించి కొత్త నరేషన్ తో అయితే సినిమా చేస్తున్నారని కొన్ని గాసిప్స్ రాగా వీటిపై ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇప్పుడు తెలిసింది. ఈ సినిమాలో ఫహద్ ని తీసేయలేదట.
ఫహద్ 100 పర్సెంట్ సినిమాలో ఉన్నాడు. ఇప్పుడు తనపై సీన్స్ నే మేకర్స్ తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ షూటింగ్ ఇప్పుడు మారేడు మిల్లి ప్రాంతంలో జరుగుతున్నట్టుగా లేటెస్ట్ సమాచారం. దీనితో అయితే ఈ సినిమాలో ఈ స్టార్ లేడు అనే టాక్ లో ఎలాంటి నిజం లేదని తెలుసుకోవాలి.