పాయల్ రాజ్ పుత్ కెరీర్ కి అదే పెద్ద మైనస్ అంటున్నారు ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100′ సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో బోల్డ్ గా నటించడం పాయల్ కి మైనస్ అయిందని అంటున్నారు. ఈ సినిమా వరకు ఒకే అయినా ఆ తర్వాత చేసిన సినిమా పెద్ద మైనస్ గా మారింది. అందుకే టాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడం లో ఇబ్బందులు పడుతోందని అంటున్నారు.

ఆర్ ఎక్స్ 100, ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాల కారణంగానే ఇండస్ట్రీలో బీ గ్రేడ్ హీరోయిన్ అన్న స్టాంప్ పడిపోయింది. ఈ కారణంగానే బడా నిర్మాణ సంస్థల నుంచి పాయల్ కి అవకాశాలు రావడం లేదన్న టాక్ ఉంది. అయినా వెంకటేష్ నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ వెంకీ మామ లో అవకాశం వచ్చింది. ఏకంగా వెంకీ కి జంటగా నటించింది. సినిమా కూడా మంచి హిట్ సాధించింది. కాని ఈ సక్సస్ పాయల్ కి మాత్రం ఉపయోగపడలేదు.

ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటించిన డిస్కో రాజ లో నటించింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న పాయల్ ఆశలన్ని నీళ్ళలో కలిసిపోయాయి. అయితే ఈ మధ్య కాలంలో పాయల్ కొన్ని సినిమాలలో నెగిటివ్ రోల్స్ వచ్చాయట. కాని క్యారెక్టర్ లెంగ్త్ మరి తక్కువగా ఉండటంతో ఒప్పుకోలేదని అంటున్నారు. కాగా ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ జంటగా ‘అనగనగా ఓ అతిథి’ సినిమాలో నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన పాయల్ ‘మల్లిక’ లుక్ ఆకట్టుకుంది. పీరియాడికల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఆహా’ లో నవంబర్ 13న విడుదల కానుంది. అలానే తెలుగులో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ‘నరేంద్ర’ అనే సినిమాలో నటిస్తోందట. ఈ సినిమాల తో పాటు తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న ‘ఏంజెల్’ అన్న థ్రిల్లర్ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. మరి ఈ సినిమాలు గనక సక్సస్ అయితే పాయల్ కి పెద్ద హీరోల తో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి.