కార్తీకమాసంలో ఈ నాలుగు పనులు చేస్తే చాలు అంతా శుభ ఫలితాలే.. అస్సలు మరిచిపోకండి?

హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే కార్తీకమాసాన్ని ఎంతో పరమ పవిత్రమైన మాసంగా భావిస్తారు.మహాలక్ష్మి, శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో శివకేశవులను మహాలక్ష్మిని పూజించడం వల్ల అన్ని శుభ పరిణామాలు కలుగుతాయి. అయితే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో కొన్ని పనులను చేయటం వల్ల శివకేశవుల అనుగ్రహం మనపై ఉంటుంది. ముఖ్యంగా ఈ నాలుగు పనులను చేయడం ఎంతో శుభం.

నది స్నానం: ఎంతో పరమ పవిత్రమైన కార్తీకమాసంలో నది స్నానం చేయడం ఎంతో మంచిది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి నది స్నానమాచరించి నది తీరాన దీపం వెలిగించి పూజించడం ఎంతో మంచిది. ముఖ్యంగా యమునా నది స్నానం కార్తీక మాసంలో ఎంతో శుభం.

దీపదానం: కార్తీక మాసంలో దీపదానం ఎంతో ముఖ్యమైనది. దీప దానం చేయడం వల్ల ఇంటిల్లిపాది ఎంతో సుఖసంతోషాలతో ఉంటారు. ఇలా ప్రతిరోజు దీప దానం చేయడం ఎంతో మంచిది. పొరపాటున కూడా ఒక దీపాన్ని ఎవరికీ దానం చేయకూడదు. రెండు దీపాలను ఇతరులకు దానం చేయాలి అయితే దానం చేసే ముందు దీపాలలో కాస్త ఆవు నెయ్యి పసుపు కుంకుమ వేసి దానం చేయడం ఎంతో శుభ పరిణామం.

తులసి పూజ: కార్తీక మాసం తులసి పూజకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి పూజ చేసే దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. తులసి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహించడం మంచిది.

ఉసిరి పూజ:ఉసిరి చెట్టులో సాక్షాత్తు మహావిష్ణువు కొలువై ఉంటారని భావిస్తారు అందుకే కార్తీక మాసంలో తులసి చెట్టుని ఎలా పూజిస్తారో.. ఉసిరి చెట్టును అదే విధంగా పూజించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఉసిరి తులసి చెట్టులో సాక్షాత్తు మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు కనుక కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు కళ్యాణం చేయటం మంచిదని పండితులు చెబుతున్నారు.