ఇన్నాళ్ళకి సోనం కపూర్ ని టాలీవుడ్ కి తీసుకొస్తున్న బడా ప్రొడ్యూసర్ ..?

అనిల్ కపూర్ కూతురిగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పరిచయమైన సోనం కపూర్ ఆ తర్వాత తన సొంత నిర్ణయాలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సోనం కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. చాలా సెలెక్టెడ్ గా సినిమాలు ఎంచుకుంటూ సాగుతున్న సోనం ఇంతకు ముందు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తో ఉండేది. సావరియా సినిమాతో హీరోయిన్ గా మారిన సోనం కపూర్ ఆ తర్వాత హేట్ లవ్ స్టోరీ, భాగ్ మిల్కా భాగ్, ప్రేం రతన్ ధన్ పాయో, ఢిల్లీ 6, నీర్జా, వీర్ ది వెడ్డింగ్ లాంటి అద్భుతమైన సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ని అందుకుంది.

prem ratan dhan payo: Latest News, Videos and prem ratan dhan payo Photos |  Times of India

అంతేకాదు పలు కమర్షియల్ యాడ్ ఫిలింస్ తో పాటు సామాజిక కార్యక్రమాలలో పాల్గంటూ తనదైన శైలీలో సోషల్ సర్వీస్ చేస్తోంది. అయితే గతంలో చాలా సార్లు సోనం కపూర్ ని తెలుగు సినిమాలలో నటింప చేయాలని చాలా మంది టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ప్రయత్నించారు. కాని ఎందుకనో కుదరలేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ చాలామంది ఇప్పటికే తెలుగు సినిమాలలో నటించారు. వాళ్ళకి మన టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. భారీగా రెమ్యూనరేష్ ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉంటారు.

ప్రస్తుతం దీపిక పదుకొణె టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందబోయో సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే బాలీవుడ్ బ్యూటీస్ సాయీ మంజ్రేకర్ .. అడవి శేష్ నటిస్తున్న మేజర్ అన్న సినిమాతో టాలీవుడ్ కి వస్తోంది. అలాగే పూరి జగన్నాధ్ – విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ లో దిగుతోంది. కాగా ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ ని టాలీవుడ్ కి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఒక స్టార్ హీరో తో పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించబోయో భారీ పాన్ ఇండియన్ సినిమాతో సోనం కపూర్ ని టాలీవుడ్ కి తీసుకు రాబోతున్నారట.