తాప్సీ కి బికినీ అంటే అంత అసహ్యం వేసిందా ..?

తాప్సీ కి బికినీ వేసుకోవడం నచ్చదా.. లేక బికినీలో జనాలకి గ్లామర్ ట్రీట్ ఇవ్వడం ఇష్టం లేదా .. ప్రస్తుతం తాప్సీ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తుంటే ఈ విషయంలో కాస్త షాకింగ్ విషయం తెలిసింది. తాప్సీ ముందు హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమయింది. సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వత వరసగా వెంకటేష్, రవితేజ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల తో నటించింది. కాని తాప్సీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

NationalFilmAwards: 'Pink' Is Best Film On Social Issues, 'Neerja' Best  Hindi Film- SheThePeople TV

అయితే బాలీవుడ్ లో మాత్రం తాప్సీ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా బాలీవుడ్ లో తాప్సీ కీ విపరీతమైన క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పింక్, బద్లా అన్న సినిమాలతో తాప్సీ క్రేజ్ బాగా పెరిగింది. మిషన్ మంగళ్, తప్పడ్, జుడ్వా 2 లాంటి కమర్షియల్ సినిమాలకి తాప్సీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. సౌత్ నుంచి వెళ్ళిన వాళ్ళలో త్వరగా స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో క్రేజ్ దక్కించుకుందంటే అది తాప్సీ నే అని చెప్పాలి. అంతటి క్రేజ్ ఉన్న తాప్సీ బికినీ ధరించడం మీద సెన్షేషనల్ కామెంట్స్ చేసింది.

Judwaa 2' song 'Aa Toh Sahi' has Jacqueline Fernandez and Taapsee Pannu  mistakenly romancing the wrong Varun Dhawan!

జుడ్వా 2 లో బికినీ లో కనిపించిన తాప్సీ ఇక మీదట సినిమాలలో ఎంత రిక్వెస్ట్ చేసినా బికినీ వేయనని తేల్చి చెప్పింది. మాల్దీవ్స్ లో సినీ తారలందరూ బికినీలో హాట్ హాట్ అందాల ప్రదర్శనలిస్తూ నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఆ ఫొటోష్ ని సోషల్ మీడియాలో అభిమానులకి షేర్ చేసి వేడెక్కిస్తున్నారు. అయితే తాప్సీ కూడా ఒకవేళ బికీ ని వేస్తే ఇలా బీచ్ లలోనే తప్ప సినిమాలలో బికినీ వేసే ఆలోచన మానుకుంటున్నట్టు వెల్లడించింది. మరి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తాప్సీ కి సినిమాల పరంగా మైనస్ అవుతుందేమో చూడాలి.