టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన పంజాబీ ముద్దుగుమ్మ తాప్సి. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే గ్లామర్ క్వీన్ గా మారిపోయి తరువాత ఎక్కువగా అదే తరహా పాత్రలకి పరిమితం అయిపొయింది. ఆమెకి టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ వచ్చింది. స్టార్ హీరోలకి జోడీ కట్టే ఛాన్స్ లు సొంతం చేసుకుంది.
టాలీవుడ్ లో నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునే పాత్రలు పెద్దగా రాలేదని చెప్పాలి. పింక్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తాప్సికి ఆ మూవీ సూపర్ సక్సెస్ అందించింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఫిమేల్ సెంట్రిక్ కథలతో సినిమాలు చేస్తూ నటిగా దూసుకుపోతోంది. ఫిమేల్ ఒరియాంటెడ్ సినిమాలకి తాప్సి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.
అయితే ఈ మధ్యకాలంలో ఆమె నుంచి వచ్చిన ఏ మూవీ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మిథాలీరాజ్ బయోపిక్ కూడా డిజాస్టర్ అయ్యింది. అలాగే రష్మి రాకెట్ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో షారుఖ్ ఖాన్ కి జోడీగా ఒక సినిమాలో నటిస్తోంది.
గతంలో సౌత్ లో హీరోయిన్స్ కి కేవలం గ్లామర్ రోల్స్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటారు అని కామెంట్స్ చేసిన తాప్సి మరో సారి అలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. నటిగా తనని తాను నిరూపించుకునే పాత్ర సౌత్ లో ఒక్కటి కూడా రాలేదని తాప్సి వ్యాఖ్యలు చేసింది. స్టార్ డమ్ వచ్చిన నటిగా తనకి సంతృప్తి దొరకలేదని పేర్కొంది.
తాప్సి చేసిన వ్యాఖ్యలని కొంత మంది నెటిజన్లు తప్పు పడుతున్నారు. స్టార్ డమ్ వచ్చింది కాబట్టి బాలీవుడ్ పిలిచి అవకాశం ఇచ్చింది. లేదంటే నువ్వెవరో కూడా ఎవరికితెలిసేది కాదు అంటూ విమర్శలు చేస్తున్నారు. కొంతమంది తాప్సి వ్యాఖ్యలకి మద్దతు ఇస్తున్నారు. ఒక నటికి సంతృప్తి లభించేది వెండితెరపై తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు వచ్చినపుడే. అదే విషయాన్ని తాప్సి ప్రస్తావించారు అంటూ మద్దతు ఇస్తున్నారు.