దిల్ రాజు పవన్ కోసం ఎవర్ని సెట్ చేశారో ఏమో ?

Dil Raju to bring sensation chief guest for Pawan Kalyan
Dil Raju to bring sensation chief guest for Pawan Kalyan
 
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం వకీల్ సాబ్.  హిందీ పింక్ చిత్రానికి ఇది రీమేక్.  వేణు శ్రీరామ్ దర్శకుడు.  ఏప్రిల్ 8న సినిమా రిలీజ్ కానుంది.  అభిమానుల్లో, ప్రేక్షకుల్లో సినిమా మీద విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది.  చిత్ర బృందం కూడ ఆ అంచనాలను మరింత పెంచేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.  అందుకే విడుదలకు ముందు భారీ ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు.  ఏప్రిల్ 3వ తేదీన ఈ వేడుక హైదరాబాద్లోని యూసఫ్ గుడ పోలీస్ గ్రౌండ్స్ నందు జరగనుంది.  ఈ వేడుకను అత్యంత భారీ స్థాయిలో చేయాలని చూస్తున్నారు దిల్ రాజు.  
 
అందుకే వేడుకకు అనూహ్యమెన అతిథిని ఆహ్వానించనున్నారట.  ఇంతకీ ఆ అతిథి ఎవరనేదే సస్పెన్స్.  టాలీవుడ్ నుండి చిరంజీవిని మినహా ఎవరిని అతిథిగా పిలిచినా పవన్ స్టేచర్ ను మించలేరనేది వాస్తవం.  మరి పవన్ ను మించి ఎవరిని తీసుకొస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.  కొందరేమో ఒరిజినల్ వెర్షన్లో చేసిన అమితాబ్ బచ్చన్ వస్తారని అంటుంటే ఇంకొందరేమో తమిళ వెర్షన్లో చేసిన అజిత్ వస్తారని అంటున్నారు.  మరికొందరు మహేష్ బాబు లేదా ప్రభాస్ చీఫ్ గెస్ట్ అయితే ఇంకా బాగుంటుందని అంటున్నారు.  మరి ఇంతకీ దిల్ రాజు ఎవర్ని తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.