గాసిప్స్ : అతడి విషయంలో డిజప్పాయింట్ గా శంకర్??

991953-director-shankar

ఇండియన్ సినిమాని ఎప్పుడో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో పెట్టిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దశాబ్ద కాలం కితమే పాన్ ఇండియా సినిమా షేక్ చేసిన దర్శకుడు శంకర్ అనే చెప్పాలి. మరి ఇపుడు శంకర్ అయితే తన బ్యాడ్ పేజ్ లో ఉండగా శంకర్ మాస్ కం బ్యాక్ కోసం అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇప్పుడు శంకర్ ఇండియన్ సినిమా దగ్గర ఏ దర్శకుడు చేయని విధంగా రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లని అయితే ఒకేసారి చేస్తున్నారు. మరి ఈ చిత్రాల్లో ఉలగనయగన్ కమల్ హాసన్ తో చేస్తున్న భారీ చిత్రం “ఇండియన్ 2” ఒకటి కాగా ఈ సినిమా విషయంలో మాత్రం శంకర్ సంగీత దర్శకుడు అనిరుద్ విషయంలో డిజప్పాయింట్ గా ఉన్నారని రూమర్స్ కోలీవుడ్ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి.

నిజానికి శంకర్ ఇప్పటివరకు తన సినిమాల్లో ఏ ఆర్ రెహమాన్, హరీష్ జై రాజ్ లతో మాత్రమే వర్క్ చేశారు. కానీ ఫస్ట్ టైం అనిరుద్ తో వర్క్ చేస్తుండగా తాను అయితే శంకర్ కోరుకునే రేంజ్ మ్యూజిక్ ఇవ్వట్లేదని అంటున్నారు. కాగా ఈ సినిమాకి అనిరుద్ ని కూడా రజినీ చెప్పడం వల్లే తీసుకున్నారని మరో గాసిప్ కూడా ఉంది.

దీనితో ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం అనిరుద్ పై శంకర్ అంత పాజిటివ్ గా లేడు అంటున్నారు. మరి ఇదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. మరి అసలు నమ్మకమే లేని రామ్ చరణ్ సినిమాకి థమన్ ఎలాంటి మ్యూజిక్ అందిస్తున్నాడో ఏంటో అని మెగా ఫ్యాన్స్ కాస్త కంగారుగా ఉన్నారు.