“సలార్”, “ఉగ్రం” ఒకటేనా..? నిర్మాత ఏమన్నాడంటే 

ఇప్పుడు నో డౌట్ గా పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలు ఉన్న మోస్ట్ అవైటింగ్ రిలీజ్ గా ప్రభాస్ నటించిన చిత్రం “సలార్” నే ఉందని చెప్పాలి. మరి హీరో ప్రభాస్ మరియు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ మాసివ్ ఎంటెర్టైనర్ ఏక్షన్ మూవీ లవర్స్ కి ఓ ఫీస్ట్ గా అయితే రాబోతుంది.

మరి ఈ భారీ చిత్రం విషయంలో ప్రశాంత్ నీల్ మొదటి సినిమా “ఉగ్రం” షేడ్స్ చాలా ఉన్నాయని కన్నడ ఆ సినిమా చూసిన వారు చాలానే పోలికలు ట్రైలర్ వచ్చాక కూడా చూపించారు. అయితే ఈ సినిమా రీమేక్ అవునా కాదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంటే.

ఈ రూమర్స్ మీద సినిమా నిర్మాత స్పందించినట్టుగా తెలుస్తుంది. హోంబలే ఫిలిమ్స్ నిర్మాత విజయ్ సలార్ కి ఉగ్రం సినిమాకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేసారు. కాగా ఉగ్రం, కేజీఎఫ్ లాంటి సినిమాలు తీసింది ప్రశాంత్ నీల్ అయినపుడు తాను కొత్త సినిమాలు కొత్త కథలతో చేయగలడు అలానే సలార్ కూడా కొత్త సబ్జెక్టునే అని క్లియర్ చేశారు.

దీనితో సలార్ సినిమా వేరు ఉగ్రం సినిమా వేరు అని చెప్పడం ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇప్పుడు కాస్త ఊరటగా మారింది. ఇక ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృద్వి రాజ్, జగపతిబాబు తదితరులు సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.