“రామారావు” కి భారీ లాసెస్..రవితేజ డబ్బులు వెనక్కి ఇవ్వడంలో నిజం ఇదే.!

Ramarao on Duty

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా మజిలీ ఫేమ్ హీరోయిన్ దివ్యంషా కౌశిక్ హీరోయిన్ గా నటించిన చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ” కూడా ఒకటి. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంకి కొత్త దర్శకుడు శరత్ మండవ వర్క్ చేసాడు.

అయితే ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట తోనే తేలిపోవడంతో ఇది కూడా భారీ నష్టాలు ఇచ్చే సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అయితే ఈ చిత్రంపై రవితేజ గత ప్లాప్ చిత్రం “ఖిలాడీ” ప్రభావం ఉన్నా కూడా దీనికి మంచి బిజినెస్ జరిగింది. దీనితో సినిమా ఫలితం తేడాగా రావడంతో భారీ లాసులు తప్పలేదు.

ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం నష్టాల్లో చాలా వరకు రవితేజ తన రెమ్యునరేషన్ రూపంలో వెనక్కి తిరిగి ఇచ్చేసాడని అంతేకాకుండా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాతకి కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చాడని పలు వార్తలు అయితే బయటకి వచ్చాయి.

కానీ ఈ చిత్రం విషయంలో అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రవితేజ ఎలాంటి డబ్బులు వెనక్కి ఇవ్వలేదని ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఇది ప్రస్తుతానికి ఉన్న వార్త మాత్రమే భవిష్యత్తులో ఇస్తాడా లేదా అనేది రెండో విషయం కానీ ప్రస్తుతం అయితే రవితేజ ఇచ్చేసాడు అని వచ్చిన వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.